పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై తుల ఉమ క్లారిటీ
వేములవాడ బీజేపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని తుల ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఏమన్నారో ఫుల్ డీటేల్స్ ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం పదండి.
తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు బీజేపీ నేత తుల ఉమ. బీజేపీ నుంచి వేములవాడ టిక్కెట్ ఆశించి ఆమె భంగపడ్డారు. తొలుత ప్రకటించిన జాబితాలో తుల ఉమ పేరు ఉంది. అయితే చివరిక్షణంలో మాజీ కేంద్రమంత్రి విద్యాసాగర్‌రావు తనయుడు వికాస్‌రావుకు బీఫామ్ ఇవ్వడంతో ఉమ షాక్‌కు గురయ్యారు. వేములవాడ ప్రజలు తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని , అవసరమైతే ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే పార్టీ మారుతున్నట్టు తనపై తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని తుల ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీ లోని వెళ్ళడం లేదని తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. తాను పార్టీ మారుతున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలు అసత్యమన్నారు. అంతేకాకుండా ప్రగతిభవన్ వెళ్లి కేసీఆర్‌ను కలుస్తునట్టు కూడా తప్పుడు వార్తలు వస్తున్నాన్నారు. కాంగ్రెస్ కాని , బీఆర్‌ఎస్ లోకి కాని వెళ్లాలని ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదన్నారు తుల ఉమ.
తనను నమ్ముకున్న కార్యకర్తలు , అనుచరులను సంప్రదించిన తరువాత పార్టీ మార్పులపై నిర్ణయం తీసుకుంటానని అన్నారు పార్టీ లోకి రావాలని బీజేపీ , బీఆర్‌ఎస్ నేతలు ఆహ్వానించారని , కాని తాను ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. రాజకీయంగా తాను ఇప్పటికే చాలా నష్టపోయినట్టు చెప్పారు. మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదన్నారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయం భవిష్యత్‌లో అందరికి ఉపయోగపడే విధంగా ఉంటుందన్నారు. రెండు మూడు రోజులు నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు తుల ఉమ. వికాస్‌రావు టిక్కెట్ ఇవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు తుల ఉమ. బీజేపీలో తనకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. నమ్మించి మోసం చేశారని నామినేషన్ రోజు కన్నీటి పర్యతం అయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..