TSRTC: దసరా పండుగ వేళ గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ
మరికొన్ని రోజుల్లో బతుకమ్మ, దసరా పండుగలు రానున్నాయి. పట్టణాలు, నగరాల్లో ఉండే చాలామంది ప్రజలు తమ సొంతూళ్లుకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా వారి గమ్యస్థానాలను చేర్చేందుకు టీఎస్‌ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల సౌకర్యార్థం కోసం ఏకంగా 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది టీఎస్‌ఆర్టీసీ. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యానికి అవకాశం ఇచ్చింది.

మరికొన్ని రోజుల్లో బతుకమ్మ, దసరా పండుగలు రానున్నాయి. పట్టణాలు, నగరాల్లో ఉండే చాలామంది ప్రజలు తమ సొంతూళ్లుకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా వారి గమ్యస్థానాలను చేర్చేందుకు టీఎస్‌ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల సౌకర్యార్థం కోసం ఏకంగా 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది టీఎస్‌ఆర్టీసీ. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యానికి అవకాశం ఇచ్చింది. ఇదిలా ఉండగా.. అక్టోబర్ 22వ తేదీన సద్దుల బతుకమ్మ, 23న మహార్ణవమి అలాగే.. 24న దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆయా రోజుల్లో.. అవసరాన్ని బట్టి మరి కొన్ని ప్రత్యేక బస్సులను కూడా నడపనుంది టీఎస్‌ఆర్టీసీ సంస్థ.
ముఖ్యంగా.. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సైతం ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అలాగే హైదరాబాద్‌లో ప్రధాన బస్టాండ్‌లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్‌తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండేటటువంటి కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. అయితే పండుగ రోజుల్లో ఎంజీబీఎస్-ఉప్పల్, అలాగే ఎంజీబీఎస్-జేబీఎస్, ఎంజీబీఎస్-ఎల్బీనగర్ మార్గాల్లోని ప్రతి 10 నిమిషాలకు ఒక సిటీ బస్సు అందుబాటులో ఉంచనున్నారు. అంతేకాదు అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెగ్యూలర్, స్పెషల్ సర్వీసులను ఎంబీజీఎస్ నుంచి మాత్రమే కాకుండా మరికొన్ని ప్రాంతాల నుంచి నడపాలని నిర్ణయం తీసుకున్నారు సంస్థ అధికారులు.
అలాగే ఏపీలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు సైతం సీబీఎస్ నుంచే బయలుదేరుతాయి. అలాగే ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల వైపునకు వెళ్లే బస్సులు జేబీఎస్, పికెట్ నుంచి వెళ్తాయి. అలాగే వరంగల్, హన్మకొండ, జనగామ, పరకాల, నర్సంపేట, మహబుబాబాద్, తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్ అలాగే ఉప్పల్ బస్టాండ్ నుంచి బయలుదేరుతాయి. అయితే విజయవాడ, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం వైపు వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి వెళ్తాయి. అలాగే మిగతా సర్వీసులు అనేవి యథావిధిగా మహాత్మగాంధీ బస్ స్టేషన్ నుంచే నడుస్తాయి. ఇదిలా ఉండగా.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. బతుకమ్మ, దసరా పండకలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నామని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




