TSRTC: సంక్రాంతికి సొంతూరుకు వెళ్లేవారికి గుడ్‌ న్యూస్‌.. 4,233 స్పెషల్‌ బస్సులు నడపనున్న టీఎస్‌ఆర్టీసీ

|

Dec 09, 2022 | 10:13 PM

సంక్రాంతి రవాణా ఏర్పాట్లకు సంబంధించి శుక్రవారం టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆర్టీసీ అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంక్రాంతికి టీఎస్‌ఆర్టీసీ 10 శాతం బస్సులను అదనంగా నడుపుతున్నట్లు ఆయన తెలిపారు.

TSRTC: సంక్రాంతికి సొంతూరుకు వెళ్లేవారికి గుడ్‌ న్యూస్‌.. 4,233 స్పెషల్‌ బస్సులు నడపనున్న టీఎస్‌ఆర్టీసీ
Tsrtc
Follow us on

సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు టీఎస్ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వారి కోసం 4, 233 స్పెషల్‌ బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 15వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. వీటిలో 585 బస్సు సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ఈ మేరకు సంక్రాంతి రవాణా ఏర్పాట్లకు సంబంధించి శుక్రవారం టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆర్టీసీ అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంక్రాంతికి టీఎస్‌ఆర్టీసీ 10 శాతం బస్సులను అదనంగా నడుపుతున్నట్లు ఆయన తెలిపారు.

కాగా మొత్తం 4,233 బస్సులకు గానూ అమలాపురంకు 125, కాకినాడకు 117, కందుకూరుకు 83, విశాఖపట్నంకు 65, పోలవరానికి 51, రాజమండ్రికి 40 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్‌డ్ టికెట్ బుకింగ్‌ను 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచామని, వచ్చే ఏడాది జూన్‌ వరకు అందుబాటులో ఉంటుందని టీఎస్‌ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..