తెలంగాణ ఆర్టీసీ పేరులో కీలక మార్పు.. అధికారికంగా ప్రకటించిన సంస్థ ఎండీ..

|

May 22, 2024 | 3:59 PM

తెలంగాణ ఆర్టీసీ పేరులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ విషయాలన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారికంగా ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు టీఎస్‎ఆర్టీసీ అని ఉన్న పేరును టీజీఎస్‎ఆర్టీసీగా మార్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సీఎం రేవంత్ పాలనాపగ్గాలు చేపట్టినప్పటి నుంచి అనేక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు.

తెలంగాణ ఆర్టీసీ పేరులో కీలక మార్పు.. అధికారికంగా ప్రకటించిన సంస్థ ఎండీ..
Tgsrtc Md
Follow us on

తెలంగాణ ఆర్టీసీ పేరులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ విషయాలన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారికంగా ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు టీఎస్‎ఆర్టీసీ అని ఉన్న పేరును టీజీఎస్‎ఆర్టీసీగా మార్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సీఎం రేవంత్ పాలనాపగ్గాలు చేపట్టినప్పటి నుంచి అనేక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈక్రమంలోనే స్కూటర్లు, కార్లు, ఇతర వాహనాలు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి టీఎస్ బదులుగా టీజీ అనే అక్షరాలు కేటాయిస్తున్నారు. వారి వాహనాల నంబర్ ప్లేట్‎లలో టీఎస్ బదులుగా టీజీ అని రావడం అప్పట్లో చాలా మందిలో కొత్త చర్చకు దారి తీసింది.

ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ అయిన ఆర్టీసీ అబ్రివేషన్‎లో టీఎస్‎ఆర్టీసీకి బదులు టీజీఎస్‎ఆర్టీసీ అని కొత్త పేరును తీసుకువచ్చారు. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారికంగా తెలిపారు. తన ఎక్స్ ఖాతాలో ఈ సందేశాన్ని జోడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు టీఎస్ ఆర్టీసీ పేరును టీజీఎస్ ఆర్టీసీగా మార్చడం జరిగిందన్నారు. ఈ మేరకు అధికారిక ఎక్స్‌ ఖాతాల పేర్లను తెలియజేశారు. ఇకపై @tgsrtcmdoffice, @tgsrtchq గా సంస్థ మార్చిందన్నారు. ప్రయాణీకులు, ప్రజలు తమ విలువైన సలహాలు, సూచనలతో పాటు ఏవైనా ఫిర్యాదులు ఉంటే మార్చిన ఈ ఖాతాల ద్వారా తమ దృష్టికి సమాచారం తీసుకురావాలని విజ్ఙప్తి చేశారు. తెలంగాణ ఆర్టీసీ అందిస్తోన్న సేవల గురించి తెలుసుకునేందుకు @tgsrtcmdoffice, @tgsrtchq అనే ఎక్స్ ఖాతాలను ఫాలో అవ్వాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…