TSRTC: లా అండ్ ఆండర్ కంట్రోల్ చేసే పోలీస్ కమిషనర్‌గా తన మార్క్ రూలింగ్ చూపిన సజ్జనార్.. ఇప్పుడు ఆర్టీసీ ఎండీగానూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. నష్టాల్లో ఉన్న టీఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఆర్టీసీ స్కీమ్‌లు, నిర్ణయాలు, ఆఫర్లు, సర్వీస్ వివరాలు సహా అన్ని అంశాలను నెటిజన్లతో షేర్ చేస్తున్నారు. ఆర్టీసీకి అన్ని రకాల వివరాలు అందిస్తూ ఎంతో యాక్టీవ్‌గా ఉండే సజ్జనార్.. తాజాగా నెటిజన్లకు ఒక ఫజిల్ ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ స్వీకరించే, సమాధానం చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు.
ఇంతకీ సజ్జనార్ విసిరిన ఛాలెంజ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. టీఆర్ఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో ఆర్టీసీ బస్సు వెనుకాల ఉండే నెంబర్ ప్లేట్‌ను షేర్ చేశారు. సాధారణంగా అన్ని వాహనాలకు నెంబర్ ప్లేట్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. కానీ, ఆర్టీసీ బస్సుకు మాత్రం ఇంగ్లీష్‌తో పాటు.. తెలుగులోనూ ఉంటుంది. ఆ తెలుగు నెంబర్స్‌నే సజ్జనార్ పోస్ట్ చేశారు. ‘‘టీఎస్ఆర్టీసీ బస్సు వెనుక ఇంగ్లీష్‌లో కాకుండా తెలుగు అక్షరాలలో అంకెలను ఎక్కడైనా చూశారా? మీలో ఎంత మందికి ఈ అంకెలను చదవడం వచ్చు?’’ అని ఛాలెంజ్ విసిరారు. అయితే, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సజ్జనార్ ఈ ఫజిల్ ఇవ్వడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. సజ్జనార్ ఫజిల్‌కు చాలామంది రియాక్ట్ అయ్యారు. కొందరు సమాధానం చెప్పగా.. మరికొందరు తెలియదని పేర్కొంటూ కామెంట్స్ పెడుతున్నారు.
#TSRTC బస్సు వెనుక కాకుండా తెలుగు అంకెలను ఎక్కడైనా చూసారా? మీలో ఎంత మందికి ఈ అంకెలను చదవడం వచ్చు? #తెలుగుభాషదినోత్సవం #TeluguLanguageDay pic.twitter.com/ZWNIgaoJgP
— Managing Director – TSRTC (@tsrtcmdoffice) August 29, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..