TSRTC: టీఎస్ఆర్టీసీ మరో గుడ్‌న్యూస్‌.. ఇకపై గ్రామీణ, పట్టణ ప్రయాణికులకూ స్పెషల్ ఆఫర్‌

|

Jun 16, 2023 | 3:51 PM

తెలంగాణ ఆర్టీసీ రాష్ట్ర ప్రజలకు తీపికబురు చెప్పింది. నగరాల్లో మాత్రమేకాకుండా గ్రామీణ ప్రయాణికు కూడా ప్రత్యేక ప్రయాణ సౌకర్యం కల్పించింది. ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు టీ9 టికెట్‌ను తీసుకొచ్చింది. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో 'టీ-9 టిక్కెట్‌' పోస్టర్‌ను టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌..

TSRTC: టీఎస్ఆర్టీసీ మరో గుడ్‌న్యూస్‌.. ఇకపై గ్రామీణ, పట్టణ ప్రయాణికులకూ స్పెషల్ ఆఫర్‌
TSRTC T9 Ticket
Follow us on

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ రాష్ట్ర ప్రజలకు తీపికబురు చెప్పింది. నగరాల్లో మాత్రమేకాకుండా గ్రామీణ ప్రయాణికు కూడా ప్రత్యేక ప్రయాణ సౌకర్యం కల్పించింది. ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు టీ9 టికెట్‌ను తీసుకొచ్చింది. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ‘టీ-9 టిక్కెట్‌’ పోస్టర్‌ను టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ శుక్రవారం (జూన్‌ 16) ఆవిష్కరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లను టీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. సిటీలో ఈ టిక్కెట్లకు మంచి స్పందన రావడంతో గ్రామీణ, పట్టణ ప్రయాణికుల కోసం మొదటిసారిగా ‘టి-9 టిక్కెట్‌’ను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవల్సిందిగా టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ కోరారు. ఇతర సందేహాల కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లను 040-69440000, 040-23450033లను సంప్రదించాలని ఆయన సూచించారు.

‘టీ 9 టికెట్‌’ ప్రత్యేకతలేమంటే..

  • పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, 60 ఏళ్లుపైబడిన వృద్ధులు మాత్రమే టి 9 టిక్కెట్‌ వినియోగించుకోవడానికి అర్హులు.
  • టీ-9 టిక్కెట్‌ ధర రూ.100గా ఆర్టీసీ నిర్ణయించింది
  • గ్రామాల్లోని పల్లె వెలుగు బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు కొనుగోలు చేయవచ్చు.
  • 60 ఏళ్లు పైబడిన వృద్ధులు వయస్సు ధృవీకరణ కోసం తమ ఆధార్ కార్డును కండక్టర్‌లకు తప్పనిసరిగా చూపించవల్సి ఉంటుంది.
  • ఈ టిక్కెట్టు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
  • టీ9 టికెట్‌తో 60 కిలోమీటర్ల లోపు ప్రయాణించవల్సి ఉంటుంది. రావడానికి, పోవడానికి ఒకసారి మాత్రమే వినియోగించాలి.
  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులో టీ9 టికెట్లు చెల్లుబాటు అవుతాయి.
  • ఈ టికెట్ ద్వారా ఒక్కొ ప్రయానికుడిపై రూ.20 నుంచి రూ.40 వరకు ఆర్థిక బారం తొలగినట్లవుతుందని ఆర్టీసీ పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.