TSRTC: మహిళలకు ఉచిత ప్రయాణంపై మార్గదర్శకాలు..! ఎలాంటి షరతులు వర్తిస్తాయంటే..

|

Dec 08, 2023 | 1:30 PM

తెలంగాణ ఆర్టీసీ నిత్యం 12-13 లక్షల కిలోమీటర్ల మేర బస్సుల్ని నడుపుతోంది. సగటున రోజుకు రూ.14 కోట్ల రాబడి వస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ప్రయాణికుల్లో దాదాపు 40 శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వీరికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఆర్టీసీ సంస్థకు రావాల్సిన ఆదాయం సుమారుగా రూ.4 కోట్ల వరకు తగ్గుతుందని అంచానా. ఇక సిటీ స‌ర్వీస్ ల ద్వారా రోజుకి మ‌రో 50 ల‌క్ష‌లు..

TSRTC: మహిళలకు ఉచిత ప్రయాణంపై మార్గదర్శకాలు..! ఎలాంటి షరతులు వర్తిస్తాయంటే..
Free Travel Scheme
Follow us on

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు హామీల అమలుపై ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని డిసెంబర్‌ 9నుంచే ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) సజావుగా అమలు చేయడానికి రంగం సిద్ధం చేసే ప్రక్రియను ప్రారంభించింది.  ఈ నేపథ్యంలోనే టిఎస్‌ఆర్‌టిసి సంస్థ ఆపరేషన్స్‌ ఈడీ మునిశేఖర్‌ నేతృత్వంలో అధికారుల బృందం గురువారం హుటాహుటిన కర్ణాటకకు వెళ్లింది. కర్ణాటక  రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలుతీరు, సంస్థపై ఆర్థిక ప్రభావం, ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయం తదితర వివరాలను అక్కడి అధికారులతో చర్చించి అన్ని విషయాలను తెలుసుకున్నారు. అనంతరం వారు సేకరించిన ప్రాధమిక సమాచారమంతా సంస్థ ఎండీ సజ్జనార్‌కు అందించారు.  ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సజ్జనార్ భేటీ అనంతరం మహిళలకు ఉచిత ప్రయాణంపై మార్గదర్శకాలు వెల్లడించే అవకాశం ఉంది.

ఇకపోతే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో టిఎస్‌ఆర్‌టిసి ఎండీ సజ్జనార్‌ భేటీ అనంతరం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలతో కూడిన స్పష్టమైన ప్రకటన వెలువడనుంది. ఏఏ బస్సుల్లో మహిళలను అనుమతిస్తారు, ప్రయాణ పరిధి ఎంత వరకు నియమిస్తారు అన్నది తెలియనుంది. అలాగే, ప్రయాణించే వారు ఏఏ గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది తదితరాలను మార్గదర్శకాల్లో వెల్లడిస్తారు. తెలంగాణ ఆర్టీసీ నిత్యం 12-13 లక్షల కిలోమీటర్ల మేర బస్సుల్ని నడుపుతోంది. సగటున రోజుకు రూ.14 కోట్ల రాబడి వస్తోంది.

ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ప్రయాణికుల్లో దాదాపు 40 శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వీరికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఆర్టీసీ సంస్థకు రావాల్సిన ఆదాయం సుమారుగా రూ.4 కోట్ల వరకు తగ్గుతుందని అంచానా. ఇక సిటీ స‌ర్వీస్ ల ద్వారా రోజుకి మ‌రో 50 ల‌క్ష‌లు తగ్గిపోయే వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మ‌చారం..ఈ విష‌యాల‌నే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీఎం రేవంత్ కు వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఏది ఏమైనా.. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్న..  టిఎస్‌ఆర్‌టిసి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు రెండింటిలోనూ అమలు చేస్తే  అంచనా వ్యయం సంవత్సరానికి రూ. 2,200 కోట్లు అవుతుందని సీనియర్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం పల్లె వెలుగు పరిధిలోని ఆర్టీసీ బస్సులకే పరిమితమైతే ఏడాదికి రూ.750 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా ఉచిత బస్సు ప్రయాణ పథకం కోసం ఎదురు చూస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..