Telangana: ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసీ

కొత్తగా ఎన్నికైన సభ్యులతో మొదటగా ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్‌ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.  ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించమని కాంగ్రెస్ కోరడంతో.. అక్బరుద్దీన్‌ అంగీకరించారు.  ప్రొటెం స్పీకర్‌ ముందుగా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.

Telangana: ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసీ
Akbaruddin Owaisi
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 08, 2023 | 1:27 PM

తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాలకు ప్రొటెం స్పీకర్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది చర్చకు ఎండ్ కార్డు పడింది. ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. డిసెంబరు 9న కొత్త సభ కొలువుదీరి.. ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో మొదటగా ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్‌ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.  ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించమని కాంగ్రెస్ కోరడంతో.. అక్బరుద్దీన్‌ అంగీకరించారు.  ప్రొటెం స్పీకర్‌ ముందుగా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.

శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌‌ను కాంగ్రెస్‌ ఎంపిక చేసింది.  కాంగ్రెస్‌కు 64 సభ్యుల బలం ఉండగా, మిత్రపక్షమైన సీపీఐకి ఒక స్థానం ఉంది. మెజారిటీ స్పష్టంగా ఉన్నందున స్పీకర్ ఎంపిక లాంఛనప్రాయం కానుంది. అధిష్ఠానం అన్ని కోణాల్లో ఆలోచించి దళిత వర్గానికి చెందిన ప్రసాద్‌ను స్పీకర్‌ పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…