TSPSC: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్స్‌ కేసులో కింగ్‌ పిన్‌ అతనే.. సంచలన విషయం వెల్లడించిన సిట్..

తెలంగాణను షేక్‌ చేస్తోన్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్స్‌ కేసులో.. కింగ్‌ పిన్‌ రాజశేఖరేనని తేల్చింది సిట్‌ నివేదిక. సెక్రటరీ దగ్గర పీఏగా పనిచేస్తూ పరీక్ష పత్రాలు కొట్టేసినట్టు నిర్దారించింది.

TSPSC: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్స్‌ కేసులో కింగ్‌ పిన్‌ అతనే.. సంచలన విషయం వెల్లడించిన సిట్..
TSPSC
Follow us

|

Updated on: Mar 17, 2023 | 9:08 PM

తెలంగాణను షేక్‌ చేస్తోన్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్స్‌ కేసులో కింగ్‌ పిన్‌ రాజశేఖరేనని తేల్చింది సిట్‌ నివేదిక. సెక్రటరీ దగ్గర పీఏగా పనిచేస్తూ పరీక్ష పత్రాలు కొట్టేసినట్టు నిర్దారించింది. మరోవైపు ఆరుగురు నిందితుల్ని కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం. లీకేజీ ఎపిసోడ్‌పై ఇవాళ కూడా పొలిటికల్ ప్రకంపనలు కొనసాగాయి.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ, డీఏవో పరీక్షలు రద్దు..

ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో TSPSC కీలక నిర్ణయం తీసుకుంది. టీవీ9 వరుస కథనాలతో అలర్ట్ అయిన TSPSC గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేసింది. రద్దు చేసిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను జూన్‌ 11న నిర్వహించాలని నిర్ణయించింది. మిగతా పరీక్షల డేట్స్‌ని త్వరలో ప్రకటిస్తామంది. మరోవైపు ప్రవీణ్ పెన్‌ డ్రైవ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో నాలుగు పేపర్లకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నట్టు గుర్తించారు. రానున్న 3,4 నెలల్లో 20కి పైగా టీఎస్‌పీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. వాటికి సంబంధించిన పేపర్లు ప్రవీణ్ పెన్ డ్రైవ్‌లు ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీంతో అన్ని పేపర్లకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను మార్చాలని నిర్ణయం తీసుకుంది టీఎస్‌పీఎస్‌సీ.

సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్..

పేపర్ లీకేజీ వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. TSPSC ముట్టడికి యూత్‌ కాంగ్రెస్ పిలుపునివ్వడంతో భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. టీఎస్‌పీఎస్‌సీ వైపు వెళ్లే క్రమంలో గాంధీభవన్ గేట్లు మూసివేసి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది కార్యకర్తలు గేట్లు దూకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఇష్యూపై CBI లేదంటే సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్.

ఇవి కూడా చదవండి

బీజేపీ కూడా ఆందోళనబాట పట్టింది. బండి సంజయ్ ఆధ్వర్యంలో కమిషన్ ముట్టడికి ప్రయత్నించింది. గన్‌పార్క్‌ నుంచి పార్టీ శ్రేణలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన సంజయ్‌ని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కొంతమంది బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు పోలీసులు. కమిషన్‌ను రద్దు చేసి.. ఛైర్మన్‌తోపాటు సభ్యులను విచారించాలన్నారు బండి సంజయ్‌.

లీకేజ్‌ కేసులో సంజయ్ ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్‌. TSPSC స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థన్న కనీస అవగాహన కూడా సంజయ్‌కు లేదన్నారు. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి గందరగోళం సృష్టిస్తున్నారన్నారు కేటీఆర్‌.

TSPSC పేపర్ లీక్స్‌ ఎపిసోడ్‌లో కీలక ఆంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం వ్యవహారంలో కింగ్ పిన్ రాజశేఖరేనని తేల్చింది సిట్. ఇందుకు సంబంధించిన నివేదికను టీఎస్‌పీఎస్‌సీ అందించింది. టీఎస్‌పీఎస్‌సీకి వాంటెడ్లీ డిప్యూటేషన్‌పై వెళ్లి రాజశేఖర్‌.. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా లీక్‌జీ పనులు చక్కబెట్టినట్టు నివేదికలో సిట్ పేర్కొంది. మరోవైపు పేపర్ లీక్ కేసులో ఆరుగురు నిందితుల్ని కస్టడీకి తీసుకోనున్న పోలీసులు ఆరు రోజుల పాటు విచారించనున్నారు.

లీకేజ్ ఘటనపై ఓ వైపు విద్యార్థి సంఘాలు.. మరోవైపు రాజకీయ పార్టీలు మెరుపు ధర్నాలకు దిగుతుండటంతో పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. టీఎస్‌పీఎస్సీ పరిసరాల్లోకి ఎవరూ రాకుండా బారికేడ్లు, ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా