TSPSC Group 2: టీఎస్సీయస్సీ గ్రూప్ 2 రద్దుకు డిమాండ్‌.. 2 రోజులు గడువు కోరిన అధికారులు

|

Aug 10, 2023 | 2:18 PM

సుమారు 2 వేల మంది అభ్యర్థులు నాంపల్లి నుంచి పెద్దఎత్తున ర్యాలీగా బయలుదేరి నినాదాలు చేస్తూ కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ గ్రూప్‌ 2 అభ్యర్థుల నిరసనకు మద్దతు తెలిపారు. దీంతో కమిషన్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు కమిషన్‌ పరిసర ప్రాంతాల్లో మోహరించారు. ఈ క్రమంలో కొందరు అభ్యర్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమిషన్ కార్యాలయం సమీపంలో బైఠాయించి, పరీక్షలను వాయిదా వేయాలని ధర్నా..

TSPSC Group 2: టీఎస్సీయస్సీ గ్రూప్ 2 రద్దుకు డిమాండ్‌.. 2 రోజులు గడువు కోరిన అధికారులు
TSCSC Group 2 exam
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 10: టీఎస్సీయస్సీ గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున అభ్యర్ధులు డిమాండ్ చేస్తూ గురువారం (ఆగస్టు 10) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. సుమారు 2 వేల మంది అభ్యర్థులు నాంపల్లి నుంచి పెద్దఎత్తున ర్యాలీగా బయలుదేరి నినాదాలు చేస్తూ కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ గ్రూప్‌ 2 అభ్యర్థుల నిరసనకు మద్దతు తెలిపారు. దీంతో కమిషన్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు కమిషన్‌ పరిసర ప్రాంతాల్లో మోహరించారు. ఈ క్రమంలో కొందరు అభ్యర్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమిషన్ కార్యాలయం సమీపంలో బైఠాయించి, పరీక్షలను వాయిదా వేయాలని ధర్నా చేపట్టారు. కమిషన్‌ వ్యవహారం దరిద్రంగా ఉందని, ఎకానమికి సంబంధించి ఒకే బుక్‌ రిలీజ్‌ చేశారని, బోర్డుపై నమ్మకంలేదు చైర్మన్‌ను వెంటనే మార్చాలని అభ్యర్ధులు డిమాండ్‌ చేశారు.

ఒకే నెలలో రెండు పరీక్షలా..?

ఒకే నెలలో గ్రూప్ – 2, గురుకుల పరీక్షల నిర్వహిస్తున్నారనీ, సిలబస్‌ కూడా వేర్వేరని పేర్కొన్నారు. ఏదో ఒక పరీక్షకు మాత్రమే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీని వల్ల తమకు అర్హతలున్నప్పటికీ అవకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గ్రూప్ -2 పరీక్షకు ఆగస్టు 29, 30 తేదీలను ఖరారు చేశారు. ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. గ్రూప్ 2 పరీక్షలోని మూడో పేపర్ అయిన ఎకానమీలో అదనంగా 70 శాతం సిలబస్‌ కలిపారని, సన్నద్ధతకు కేవలం ఒక్క బుక్‌ మాత్రమే విడుదల చేశారని వాపోయారు. పేపర్ లీకేజీ ఘటనతో సరిగా చదవలేకపోయామని, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గ్రూప్ 2 పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలని బోర్డును కోరారు.

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. గ్రూప్‌ 2 వాయిదాపై ప్రభుత్వం ఆలోచన చేయాలని కోదండరాం అన్నారు. నిరుద్యోగులు అడిగేది న్యాయమైన డిమాండ్‌ అని, మూడు వేల నిరుద్యోగ భృతి అడగటం లేదని కేవలం మూడు నెలల గడువు మాత్రమే అడుగుతున్నారని అన్నారు. ఏడేళ్లు ఆగిన ప్రభుత్వం, మూడు నెలలు ఆగలేదా? అంటే ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

‘రెండు రోజులు గడువివ్వండి..’ కమిషన్‌

బోర్డు సభ్యులు ఐదుగురు సభ్యులను కార్యాలయంలోనికి పిలిపించారు. బోర్డు కార్యదర్శి అనిత రామచంద్రన్‌కు వినతి పత్రం అందజేశారు. గ్రూప్‌ 2 అభ్యర్ధుల డిమాండ్‌పై ప్రభుత్వం హామీ ఇచ్చింది. వాయిదాపై నిర్ణయం తీసుకోవడానికి బోర్డు అధికారులు 2 రోజులు గడువు కోరారు. మరోవైపు అక్టోబర్‌ లేదా నవంబర్‌లో పరీక్ష నిర్వహణకు కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. తేదీలు కూడా త్వరలో ప్రకటించనుంది. మరోవైపు ఇంతజరుగుతున్నా టీఎస్పీయస్సీ ఛైర్మన్ జనార్దన్‌ రెడ్డి అందుబాటులో లేకపోవడం విశేషం.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.