School Holidays: స్కూల్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఆగస్టు 29, 30 తేదీల్లో పాఠశాలలకు సెలవు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు విద్యాసంస్థలకు సర్కార్ రెండు రోజులు వరుసగా సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ముందస్తు సమాచారం ఇస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఆదేశాలు..

School Holidays: స్కూల్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఆగస్టు 29, 30 తేదీల్లో పాఠశాలలకు సెలవు
School Holydays

Updated on: Oct 13, 2023 | 3:02 PM

హైదరాబాద్‌, జులై 17: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు విద్యాసంస్థలకు సర్కార్ రెండు రోజులు వరుసగా సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ముందస్తు సమాచారం ఇస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్‌ 2 ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో ఈ రెండు రోజుల సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు ఆ రెండు రోజుల్లో సర్కార్‌ సెలవులు ప్రకటించింది.

దాదాపు 5.5 లక్షల మంది అభ్యర్ధులు గ్రూప్‌ 2 పరీక్షలకు హాజరవుతున్నారు. వీరందరికీ ఆఫ్‌లైన్‌ విదానంలో పరీక్షలు నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయంచింది. ఐతే ఆయా తేదీల్లో పరీక్ష కేంద్రాలుగా ఉన్న విద్యాసంస్థలు ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ, ఇంటర్‌ బోర్డు, పాఠశాల విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.