TSPSC Group 1 Prelims: జూన్ 11న తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్.. పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష జూన్ 11న నిర్వహించనున్న సంగతి తెలసిందే. పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందుగా హాల్ టికెట్లు జారీ చేయనుంది. తొలుత గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను..
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష జూన్ 11న నిర్వహించనున్న సంగతి తెలసిందే. పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందుగా హాల్ టికెట్లు జారీ చేయనుంది. తొలుత గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ తుదకు ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
తెలంగాణ గ్రూప్-1 కింద అత్యధికంగా 503 ఉద్యోగాలతో టీఎస్‌పీఎస్సీ గతేడాది ఏప్రిల్‌లో ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3.8 లక్షల మంది ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తొలుత అక్టోబరు 16న జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 2.85 లక్షల మంది హాజరయ్యారు. ఐతే టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేశారు. తిరిగి జూన్ 11న తిరిగి నిర్వహిస్తున్నారు. ఐతే లీకేజీ వ్యవహారం నేపథ్యంలో కమిషన్ ఈసారి పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. దీంతో పరీక్షల నిర్వహణ కోసం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టును సృష్టించి, ఐఏఎస్ అధికారికి బాధ్యతలను టీఎస్‌పీఎస్సీ అప్పగించింది. గ్రూప్-1 రాత పరీక్ష ప్రక్రియను ఈ ప్రత్యేక విభాగం పర్యవేక్షణలో జరుగుతుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.