Telangana: అభ్యర్థులకు అలర్ట్.. రేపే గ్రూప్-1 ప్రిలిమ్స్.. ఈ నింబంధనలు తప్పక తెలుసుకోండి..

|

Jun 10, 2023 | 9:50 PM

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ - 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆదివారం జరుగనుంది. గతంలో పేపర్ లీక్ అయిన నేపథ్యంలో.. ఈసారి కఠిన నిబంధనలను అమలు చేయనుంది టీఎస్‌పీఎస్‌సీ. పేపర్ లీకేజీతో గతంలో జరిగిన పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, పేపర్ లీకేజీ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పరీక్ష నిర్వహణకు..

Telangana: అభ్యర్థులకు అలర్ట్.. రేపే గ్రూప్-1 ప్రిలిమ్స్.. ఈ నింబంధనలు తప్పక తెలుసుకోండి..
Tspsc Group1 Exam
Follow us on

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ – 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆదివారం జరుగనుంది. గతంలో పేపర్ లీక్ అయిన నేపథ్యంలో.. ఈసారి కఠిన నిబంధనలను అమలు చేయనుంది టీఎస్‌పీఎస్‌సీ. పేపర్ లీకేజీతో గతంలో జరిగిన పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, పేపర్ లీకేజీ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది టీఎస్‌పీఎస్‌సీ. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా 994 కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తున్నారు.

అభ్యర్థులను ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందే గేట్లను మూసివేయనున్నారు. ఉదయం 10.15 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతించరు. రాష్ట్రంలో 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. 3,80,072 మంది దరఖాస్తు చేసుకున్నారు. పెన్సిల్‌, ఇంక్‌పెన్‌, జెల్‌పెన్‌, క్యాలుకులేటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతించేది లేదని టీఎస్‌పీఎస్‌సీ తేల్చి చెప్పింది.

అభ్యర్థులు బ్లూ, బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌లను మాత్రమే వినియోగించాలని, వాటిని మాత్రమే అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేసింది టీఎస్‌పీఎస్‌సీ. అభ్యర్థులను రెండు దశల్లో తనిఖీ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రాల్లోకి ఎంట్రీ ఇస్తారు. నిబంధనలను ఉల్లంఘించే అభ్యర్థులపై క్రిమినల్ కేసులు సైతం పెడతామని స్పష్టం చేసింది టీఎస్‌పీఎస్‌సి. భవిష్యత్‌‌లో నిర్వహించే ఎలాంటి పరీక్షలకు అనుమతి లేకుండా డిబార్ చేస్తామని ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..