TS Teachers Transfers: ఉపాధ్యాయ బదిలీలను వేగవంతం చేసిన తెలంగాణ సర్కార్.. షెడ్యూల్ తేదీల ఇలా..

TS Teachers Transfers Schedule 2023: రాష్ట్రంలోని టీచర్లు పదోన్నతులు బదిలీలు కోరుకుంటున్న వారు ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. 6,7 తేదీల్లో ఆన్ లైన్ అప్లికేషన్ కాపీలను డీఈవో కార్యాలయంలో ఇవ్వాలి. 8, 9 తేదీల్లో దరఖాస్తు చేసిన వారి పేర్లను డిస్‌ప్లే చేస్తారు. 10,11 తేదీల్లో అభ్యంతరాల స్వీకరిస్తారు. 12,13 సీనియారిటీ జాబితా డిస్‌ప్లే చేస్తారు. 14న ఎడిట్‌ చేసుకునేందుకు ఆప్షన్‌ ఇస్తారు. సెప్టెంబర్ 15న ఆన్‌లైన్‌లో ప్రధానోపాధ్యాయుల బదిలీలు

TS Teachers Transfers: ఉపాధ్యాయ బదిలీలను వేగవంతం చేసిన తెలంగాణ సర్కార్.. షెడ్యూల్ తేదీల ఇలా..
Teachers Transfers

Edited By:

Updated on: Sep 01, 2023 | 8:48 AM

తెలంగాణలో ఉపాధ్యాయ పదోన్నతులు బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది ఈ మేరకు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లపై ప్రతిపాదనలను రాష్ట్ర విద్యాశాఖకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన పంపించారు. ఈ ప్రతిపాదనలో షెడ్యూల్ తేదీలను సైతం ప్రకటించారు. ఈ నెల 3 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది.

రాష్ట్రంలోని టీచర్లు పదోన్నతులు బదిలీలు కోరుకుంటున్న వారు ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. 6,7 తేదీల్లో ఆన్ లైన్ అప్లికేషన్ కాపీలను డీఈవో కార్యాలయంలో ఇవ్వాలి. 8, 9 తేదీల్లో దరఖాస్తు చేసిన వారి పేర్లను డిస్‌ప్లే చేస్తారు. 10,11 తేదీల్లో అభ్యంతరాల స్వీకరిస్తారు. 12,13 సీనియారిటీ జాబితా డిస్‌ప్లే చేస్తారు. 14న ఎడిట్‌ చేసుకునేందుకు ఆప్షన్‌ ఇస్తారు. సెప్టెంబర్ 15న ఆన్‌లైన్‌లో ప్రధానోపాధ్యాయుల బదిలీలు జరుపుతారు.

ఖాళీలు.. బదిలీలు..

16న ప్రధానోపాధ్యాయుల ఖాళీ ల ప్రదర్శన, 17,18,19 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి హెచ్‌ఎంలుగా ప్రమోషన్స్ ఇస్తారు. 20,21 తేదీల్లో ఖాళీ అయిన స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల ను డిస్ ప్లే చేస్తారు. 21న వెబ్‌ ఆప్షన్ల ఎంపిక, 22న ఎడిట్‌ ఆప్షన్‌ అవకాశం కల్పిస్తారు. 23,24 స్కూల్‌ అసిస్టెంట్‌ బదిలీలు జరుగుతాయి. దానికనుగుణంగా 24 స్కూల్‌ అస్టింట్‌ ఖాళీ లు వెల్లడిస్తారు. 26,27,28 ఎస్జీటీనుంచి స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతులు ఇస్తారు. 29,30,31 SGT ఖాళీల ప్రదర్శన, అక్టోబర్‌ 2న ఎడిట్‌ ఆప్షన్స్‌ ఉంటాయి. అక్టోబర్‌ 3న ఎస్జీటీ, భాషాపండితులు, పీఈటీల ట్రాన్స్ఫర్ లు చేస్తారు. అక్టోబర్‌ 5 నుంచి 19వరకు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఇవ్వనున్నారు.

తేదీల వారిగా షెడ్యూల్ ఇలా..

  • ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు
  • 6, 7 తేదీల్లో డీఈవో కార్యాలయంలో దరఖాస్తుల సమర్పణ
  • 8, 9 తేదీల్లో దరఖాస్తుదారుల పేర్లు ప్రదర్శన
  • 10, 11 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ
  • 12, 13 తేదీల్లో సీనియారిటీ జాబితా ప్రదర్శన
  • 14న ఎడిట్‌ చేసుకునేందుకు అభ్యర్థులకు ఆప్షన్‌
  • 15న ఆన్‌లైన్‌ ద్వారా ప్రధానోపాధ్యాయుల బదిలీలు
  • 16న ప్రధానోపాధ్యాయుల ఖాళీల ప్రదర్శన
  • 17, 18, 19 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి..
  • 20, 21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ప్రదర్శన
  • 22న ఎడిట్‌ ఆప్షన్‌ వినియోగించుకునే అవకాశం
  • 23, 24 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ బదిలీలు
  • 24న స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీల ప్రదర్శన
  • 26, 27, 28 తేదీల్లో ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతులు
  • 29, 30 తేదీల్లో ఎస్జీటీ ఖాళీల ప్రదర్శన
  • అక్టోబర్ 3న ఎస్జీటీ, భాషా పండితులు, పీఈటీల బదిలీలు

స్కూల్ ఎడ్యుకేషన్ పంపిన ప్రతిపాదనలు ఇవే..

సెప్టెంబర్‌ ఒకటో తేదీ కటాఫ్‌ డేట్‌గా ప్రకటించారు. ఎక్కువ కాలం ఒకే చోట ఉన్న టీచర్లకు 8 సంవత్సరాలు, హెచ్ఎం లకు 5 సంవత్సరాల నిబంధన వర్తించేలా ప్రతిపాదన చేశారు. ఈ కాలపరిమితి పూర్తి చేసుకున్న వారి స్థానాలను ఖాళీలుగా జాబితాలో చూపిస్తారు. రిటైర్మెంట్‌కు మూడు ఏళ్ల లోపు సర్వీసున్న టీచర్లకు ట్రాన్స్ఫర్ నుంచి మినహాయంపు ఉంది. గతంలో అప్లై చేసిన వారు సైతం ఎడిట్‌ చేసుకునే అవకాశాన్ని, అదనంగా స్పాజ్‌ బదిలీలకు పాయింట్లు దరఖాస్తు చేసుకునే ఆప్షన్ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణా వార్తల కోసం