Telangana: సీఎం కేసీఆర్ పేరునే ప‌చ్చ‌బొట్టుగా వేయించుకున్న గిరిజన శాఖ మంత్రి.. ఆదివాసీలకు పెద్దపీట వేశారంటూ..

|

Jun 10, 2023 | 4:13 PM

Minister Satyavati Rathore: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పేరుని చేతికి పచ్చబొట్టుగా వేయించుకుని ఆయనపై త‌న‌కున్న గౌరవాభిమానాల్ని చాటున్నారు రాష్ట్ర గిరిజ‌న, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్. గిరిజ‌న యోధుడు కొమురం భీమ్ స‌హ‌చ‌రుని వారసులు..

Telangana: సీఎం కేసీఆర్ పేరునే ప‌చ్చ‌బొట్టుగా వేయించుకున్న గిరిజన శాఖ మంత్రి.. ఆదివాసీలకు పెద్దపీట వేశారంటూ..
Minister Satyavati Rathore Getting KCR name Tattoo
Follow us on

Minister Satyavati Rathore: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పేరుని చేతికి పచ్చబొట్టుగా వేయించుకుని ఆయనపై త‌న‌కున్న గౌరవాభిమానాల్ని చాటున్నారు రాష్ట్ర గిరిజ‌న, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్. గిరిజ‌న యోధుడు కొమురం భీమ్ స‌హ‌చ‌రుని వారసులు ఆ పచ్చబొట్టు వేయడం విశేషం. జూన్ 2 నుంచి జరుగుతున్న తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. బంజారహిల్స్, రోడ్ నెం.10 లోని బంజారా భవన్‌లో నిర్వ‌హించిన‌ గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గిరిజన శాఖ మంత్రికి ఆదివాసీ, బంజారాలు త‌మ సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఈ క్రమంలోనే ఆదివాసీ బంజారాలు సిద్ధం చేసిన వివిధ రకాల ఉత్పత్తులు, ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను మంత్రి సందర్శించారు.

అలా ఆదివాసీలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ని సందర్శిస్తున్న సమయంలో పచ్చబొట్టు స్టాల్ కూడా కనిపించడంతో మంత్రి సత్యవతి రాథోడ్ తన చేతిపై సీఎం కేసీఆర్ పేరును పచ్చబొట్టుగా వేయాలని కోరారు. పచ్చబొట్టు వేయించుకోవడం అనేది నొప్పితో కూడినది అని నిర్వహకులు చెప్పినా, కేసీఆర్ పేరును వేయాల్సిందేనని మంత్రి రాథోడ్ కోరారు. ఈ మేరకు ఆమె నొప్పిని భరిస్తూనే సీఎం కేసీఆర్ పేరునుపచ్చబొట్టుగా వేయించుకున్నారు.

Minister Satyavati Rathore and CM KCR

కాగా, మంత్రి సత్యవతికి కొమురం భీమ్ సహచరుడు వెడ్మ రాము కోడలు రాంబాయి పచ్చబొట్టు వేశారు. అనంతరం ఆమెను అభినందించి, న‌గ‌దు బ‌హుమానం అందించారు మంత్రి. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతుల‌ను ప్రోత్సాహించాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేశారని, గిరిజన అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని మంత్రి సత్యవతి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..