Telanngana: ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి.. ప్రకటన వచ్చేసింది..
తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంసెట్, నీట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రవేశ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఇంటర్ వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తిచేసి.. మే 10లోపు ఇంటర్ రిజల్ట్ విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఎప్పుడు వస్తాయ్..? అటు పేరెంట్స్‌కు, ఇప్పుడు పిల్లలకు పెద్ద క్వశ్చన్ ఇదే. తాజాగా ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చింది. తెలంగాణ ఇంటర్ రిజల్ట్ మే 10, 2023లోపు విడుదల చేయనున్నట్లు TSBIE కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రద తెలిపారు. కాగా స్టూడెంట్స్ ఫలితాలను cgg.gov.in, results.cgg.gov.in, examresults.ts.nic.in సైట్లను విజిట్ చేసి తెలుసుకోవచ్చు. టీవీ9 వెబ్ సైట్‌ను సందర్శించి కూడా ఫలితాలు పొందవచ్చు. ఈ ఏడాది దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 15 నుండి ఏప్రిల్ 3 వరకు… ఇంటర్మీడియట్ 2 వ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 4, 2023 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో జరిగాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకే షిప్టులో పరీక్షలు జరిగాయి.
TS ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించడానిక విద్యార్థి ప్రతి సబ్జెక్టులో కనీసం 35% మార్కులు సాధించాలి. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను చెక్ చేయడానికి, విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్లతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత, విద్యార్థులు మార్కుల రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. tsbie.cgg.gov.inలో ఫలితాలు ప్రకటించిన వెంటనే అందుకు సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది. వెబ్‌సైట్‌లలో కాకుండా మొబైల్ యాప్ ‘టి యాప్ ఫోలియో’లో కూడా ఇంటర్ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. కాగా ఫస్టియర్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం