AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Governor Tamilisai: దేశాధినేతలను కలవగలం.. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవలేం.. గవర్నర్‌ తమిళసై సంచలన వ్యాఖ్యలు..

ప్రగతి భవన్‌.. రాజ్‌భవన్‌ దూరంగా ఉంటున్నాయని గవర్నర్‌ అనడం సంచలనంగా మారింది. వివిధ దేశాలు ఒక్కచోటికి రాగలవు కానీ.. రాజ్‌భవన్‌ ప్రగతిభవన్‌ మాత్రం క్లోజ్‌ గా రావన్నారు. భారీ సెక్రటేరియట్‌ ప్రారంభిస్తే ఫస్ట్‌ సిటిజన్‌కి ఆహ్వానం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Governor Tamilisai: దేశాధినేతలను కలవగలం.. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవలేం.. గవర్నర్‌ తమిళసై సంచలన వ్యాఖ్యలు..
Cm Kcr, Governor Tamilisai
Sanjay Kasula
|

Updated on: May 03, 2023 | 7:18 PM

Share

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అత్యున్నత రాజ్యాంగ పదవికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ప్రభుత్వం ఇవ్వడం లేదని అన్నారు. జీ-20 సమావేశాల్లో భాగంగా హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన సి-20 సమాజ్‌శాల కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాధినేతలనైనా కలవొచ్చు కానీ.. ఈ రాష్ట్ర చీఫ్‌ని మాత్రం కలవలేం అని అన్నారు. భారీ సెక్రటేరియట్‌ ప్రారంభిస్తే ఫస్ట్‌ సిటిజన్‌ తననే ఆహ్వానించలేదన్నారు.

ప్రగతి భవన్‌.. రాజ్‌భవన్‌ దూరంగా ఉంటున్నాయని గవర్నర్‌ అనడం సంచలనంగా మారింది. వివిధ దేశాలు ఒక్కచోటికి రాగలవు కానీ.. రాజ్‌భవన్‌ ప్రగతిభవన్‌ మాత్రం క్లోజ్‌ గా రావన్నారు. భారీ సెక్రటేరియట్‌ ప్రారంభిస్తే ఫస్ట్‌ సిటిజన్‌కి ఆహ్వానం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నరు కానీ, ముఖ్యమంత్రి కానీ స్వార్థం కోసం పనిచేయరని.. దేశం కోసం, ప్రజల కోసం మాత్రమే తాము ఉన్నామన్నారు. ప్రధాన మంత్రి మోదీ సహా అందరం అదేచేస్తున్నామన్నారు. నిస్వార్థంగా పనిచేయాలని గవర్నర్ హితవు పలికారు.

సచివాలయ ప్రారంభానికి తనకు ఆహ్వానం రాలేదని తెలిపారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ప్రభుత్వం ఎప్పుడూ ప్రొటోకాల్ పాటించలేదని తప్పుబట్టారు. తాను తెలంగాణకు సేవ చేయడానికే వచ్చానని, రాజకీయాలు చేయడానికి కాదని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి తనపై వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తోందని తమిళిసై విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?