Caste Loans: వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త.. ఇకపై లోన్ కోసం కావాల్సిన ఆ పత్రాలు ఒక్కరోజులోనే..

|

Jun 13, 2023 | 5:20 AM

Telangana: ప్రభుత్వం బీసీ వృత్తి కులాలకు ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆదాయపత్రాల కోసం జనం ఖమ్మంలోని తహశీల్దారు కార్యాలయానికి పోటెత్తారు. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం.. ధరఖాస్తు దారుల వాహనాలతో..

Caste Loans: వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త.. ఇకపై లోన్ కోసం కావాల్సిన ఆ పత్రాలు ఒక్కరోజులోనే..
Caste Loans
Follow us on

Telangana: ప్రభుత్వం బీసీ వృత్తి కులాలకు ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆదాయపత్రాల కోసం జనం ఖమ్మంలోని తహశీల్దారు కార్యాలయానికి పోటెత్తారు. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం.. ధరఖాస్తు దారుల వాహనాలతో పూర్తిగా స్తంభించింది. ట్రాఫిక్‌ను అదుపు చేసేందుకు పోలీసులు రంగలోకి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయానికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. అయితే కులధృవీకరణ పత్రాలు లేనివారు, కనీసం ఆదాయ పత్రాలు లేని వారు వేల సంఖ్యలో ఉన్నారు. వారు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నా.. అవి వచ్చే సరికి చాలా సమయం పడుతోంది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ప్రజలు.

అయితే కులధృవీకరణ పత్రాలు, ఆదాయపత్రాలు లేని వారి కోసం ప్రభుత్వం ఓ ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ఒక్కరోజులో కుల, ఆదాయ పత్రాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను  ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జనం తహశీల్దారు కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. ధృవీకరణ పత్రాలకోసం ఎగబడ్డారు. తహశీల్దారు కార్యాలయంలో జనం నిండిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి