TS Congress: టి కాంగ్రెస్ లో నడుస్తున్న లంచ్, డిన్నర్ రాజకీయాలు.. కోమటి రెడ్డి ఇంట్లో లంచ్ మీట్ లో ఠాగూర్

|

Jul 10, 2022 | 3:36 PM

రోజు మూడు గొడవలు, ఆరు కామెంట్ లతో నిత్యం వార్తల్లో ఉండే కాంగ్రెస్ కు విందు రాజకీయాలు కలసివచ్చేనా..ఇంఛార్జి ఠాగూర్ వ్యూహం ఫలిస్తుందా..లంచ్ లు, డిన్నర్ లతో కాంగ్రెస్ పుంజుకుంటుందా.. నేతలు ఐక్యంగా ఉన్నారని చూపించడం కోసమే వరుస భేటీ లా ..వరుస సమావేశాల వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి..

TS Congress: టి కాంగ్రెస్ లో నడుస్తున్న లంచ్, డిన్నర్ రాజకీయాలు.. కోమటి రెడ్డి ఇంట్లో లంచ్ మీట్ లో ఠాగూర్
B Manickam Tagore Komati Re
Follow us on

TS Congress: టీ కాంగ్రెస్ లో ఇప్పుడు అంతా లంచ్ ,డిన్నర్ రాజకీయాలు నడుస్తున్నాయి .రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఇంఛార్జి ఠాగూర్ బ్రేక్ ఫాస్ట్ ఓక నేత ఇంట్లో ,లంచ్ ఇంకో నేత ఇంట్లో, డిన్నర్ మరోనేత ఇంట్లో చేస్తున్నారు.. గతంలో ఠాగూర్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నేతలను తన క్వార్టర్స్ కే పిలిపించుకుని మాట్లాడే ఠాగూర్ , ఈసారి మాత్రం నేతల ఇళ్ళలో లంచ్ ,డిన్నర్ భేటీ లకు ప్రాధాన్యత ఇచ్చారు.

శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చిన న ఠాగూర్ అర్థరాత్రి వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.. నిన్న గాంధీ భవన్ మీటింగ్ లో పాల్గొన్న అనంతరం క్వార్టర్స్ లో కీలకనేతలతో ఠాగూర్ సమావేశమైనట్లు తెలుస్తుంది..ఇక ఆదివారం మొత్తం ఠాగూర్ బిజీబిజీగా గడిపారు. ఉదయం జానారెడ్డి ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ కు ప్లాన్ చేసిన ఠాగూర్ , సడెన్ గా ప్లాన్ మార్చి ఓ రహస్య ప్రదేశం లో జానారెడ్డి తో బ్రేక్ ఫాస్ట్ చేసారు.. అయితే జానారెడ్డి, ఠాగూర్ భేటీ సమయంలో ఎవరెవరు ఉన్నాయి ,ఎక్కడ కలిసారనే చర్చ పార్టీ లో ఆసక్తికరంగా సాగుతుంది.మధ్యాహ్నం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో లంచ్ భేటీ లో పాల్గొన్నారు ఠాగూర్.. ఈ భేటీ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు ఠాగూర్, బోస్ రోజు కూడా పాల్గొన్నారు.. వ్యూహకర్త సునీల్ కనుగోలు రావాల్సి ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటి దగ్గర మీడియా ఉందని తెలిసి చివరి నిమిషంలో సునీల్ క్యాన్సిల్ అయ్యారు.ఈ భేటీ లో కేవలం లంచ్ కే అని చెప్తున్నా దాదాపు రెండు గంటల పాటు సందర్భంగా చర్చించారు.. పార్టీ లో చేరికల పై అసంతృప్తి గా ఉన్న కోమటిరెడ్డి ని బుజ్జగించేందుకే ఠాగూర్ వచ్చారని ప్రచారం జరుగుతుంది..

ఇక టీ పీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సంధర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్.జూబ్లి క్లబ్ పార్టీ నేతల గెట్ టూ గెదర్ ఏర్పాటు చేసారు.. ఈ గెట్ టూ గెదర్ కు ఠాగూర్ రాకున్నా మిగతా నేతలంతా అటెండ్ కానున్నారు.. అయితే పార్టీ నేతల మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పడానికే ఈ భేటీ లు అని పార్టీ నేతలు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి