Bandi Sanjay: ఖైదీ నెంబర్ 7917.. కరీంనగర్‌ జైల్లోని గోదావరి బ్యారక్‌లో బండి సంజయ్‌..

|

Apr 06, 2023 | 8:32 AM

Bandi Sanjay in Karimnagar Jail: పదోతరగతి పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ సహా పలువురు నిందితులను కరీంనగర్ జైలుకు తరలించారు. కరీంనగర్‌ జైల్లోని గోదావరి బ్యారక్‌లో బండి సంజయ్‌ ను ఉంచారు.

Bandi Sanjay: ఖైదీ నెంబర్ 7917.. కరీంనగర్‌ జైల్లోని గోదావరి బ్యారక్‌లో బండి సంజయ్‌..
Bandi Sanjay Arrest
Follow us on

Bandi Sanjay in Karimnagar Jail: పదోతరగతి పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ సహా పలువురు నిందితులను కరీంనగర్ జైలుకు తరలించారు. కరీంనగర్‌ జైల్లోని గోదావరి బ్యారక్‌లో బండి సంజయ్‌ ను ఉంచారు. ఖైదీ నెంబర్ 7917ను జైలు నిర్వాహకులు బండి సంజయ్ కు కేటాయించారు. ఇదిలాఉంటే.. బుధవారం రాత్రి సంజయ్ వచ్చిన తర్వాత ఆయన్ను కలవడానికి కుటుంబీకులు వచ్చారు. అయితే, పర్మిషన్ లేదని సంజయ్‌ని కలవడానికి జైలర్ ఒప్పుకోలేదు. దీంతో ఇవాళ ములాఖాత్‌కు బండి కుటుంబీకులు అప్లై చేసుకున్నారు. పర్మిషన్ వచ్చాక సంజయ్‌తో ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడనున్నారు. సంజయ్‌ జైలుకు వచ్చిన దగ్గర నుంచి బీజేపీ కార్యకర్తలు జైలు దగ్గరికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ జైలు దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదిలాఉంటే.. బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌ పై .. పోలీసుల కస్టడీ పిటిషన్‌ పై నేడు విచారణ జరగనుంది. హైకోర్ట్‌లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హన్మకొండ కోర్టు తీర్పుతో సంబంధం లేకుండానే ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. వరంగల్ తోపాటు హైకోర్టులో సంజయ్ పిటిషన్ పై విచారణ జరగనున్న నేపథ్యంలో న్యాయస్థానాలిచ్చే ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బండి సంజయ్‌ రిమాండ్‌ని కొట్టివేయాలంటూ.. హైకోర్ట్‌లో బీజేపీ లీగల్ సెల్‌ లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేసింది. మరోవైపు సంజయ్‌ని కస్టడీ కోరుతూ వరంగల్ పోలీసులు పిటిషన్ వేశారు. అయితే, బండి సంజయ్‌ మొబైల్‌ ఫోన్ ఇవ్వలేదు.. ఫోన్ డేటాతో పాటు లీకేజ్‌ కేసులో లోతుగా విచారించాలని.. కస్టడీ పిటిషన్‌లో వేర్వేరు అంశాల్ని పోలీసులు ప్రస్తావించారు.

కాగా.. బండి అరెస్ట్ విషయంలో పోలీసులు తగిన కారణాలు చూపలేదని ఆరోపిస్తోంది బీజేపీ లీగల్ సెల్. అరెస్ట్ సమయంలో నిర్దిష్ట నిబంధనలను పోలీసులు పాటించలేదని, క్రిమినల్ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్ 50ని గౌరవించలేదని పిటిషన్‌లో వివరించారు. అలాగే బొమ్మలరామారం పీఎస్‌కు ఎందుకు తీసుకెళ్లారో కూడా పోలీసులు వివరించలేదన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బండికి మాత్రలు వేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్ట్‌.. ఇవాళ పదిన్నర గంటలకు విచారణ జరపనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..