TRS Parliamentary Party: పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందులో భాగంగానే పార్టీ ఎంపీలకు కీలక సూచనలు, దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో లోక్ సభ, రాజ్య సభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలు, కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై ఎంపీలకు నివేదికలు అందజేస్తారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు ఉభయ సభల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, కేంద్రంపై అనుసరించాల్సిన పోరాట పంథాపై సీఎం కేసిఆర్ ఎంపీలకు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తారు.
Also read:
Afghanistan: ఆకలి తీర్చుకునేందుకు అవయవాలను అమ్ముకుంటున్నారు.. ఆఫ్గన్ ప్రజలను ఆదుకోండి: WFP
IIT Roorkee Jobs: ఐఐటీ – రూర్కీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..