TRS MLAs Poaching Case: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు

|

Nov 10, 2022 | 12:31 PM

నిందితులు సింహయాజీ, రామచంద్రభారతి, నందకుమార్‌లను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న పోలీసులు ప్రత్యేక భద్రత మధ్య విచారణకు తీసుకొచ్చారు.

TRS MLAs Poaching Case: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు
TRS MLAs Poaching Case Accused
Follow us on

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులను కస్టడీకి తీసుకున్న మొయినాబాద్ పోలీసులు.. రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారిస్తున్నారు. నిందితులు సింహయాజీ, రామచంద్రభారతి, నందకుమార్‌లను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న పోలీసులు ప్రత్యేక భద్రత మధ్య విచారణకు తీసుకొచ్చారు. బ్లాక్‌ ఫిల్మ్‌ ఉన్న వాహనంలో చాలా పకడ్బంధీగా నిందితులను విచారణకు తరలించారు. నిందితుల తరఫు న్యాయవాదుల సమక్షంలో వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సిటి అధికారులు వారిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. వారి స్టేట్‌మెంట్లను వీడియోలో చిత్రీకరిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు పలువురి పేర్లను నిందితులు ప్రస్తావించారు. వీరి ప్రమేయంపై నిందితులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.   నిందితులను ఇవాళ, రేపు రెండ్రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాదుల సమక్షంలో విచారించిన అనంతరం తిరిగి కోర్టుకు తరలిస్తారు. మళ్లీ రేపు ఉదయం 9 గంటలకు తమ కస్టడీకి తీసుకుంటారు.

రాజకీయంగా అత్యంత సున్నితమైన కేసు కావడంతో భిన్న కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉందని కోరడంతో తెలంగాణ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నేతృత్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌లో నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్‌ క్రైమ్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగెనవార్‌, శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌, మొయినాబాద్‌ SHO లక్ష్మిరెడ్డి ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యేలకు ఎర కేసుతో పాటు నిందితుడు రామచంద్ర భారతి నకిలీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఈ కేసుపై కూడా సిట్ అధికారులు దృష్టిసారించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి