AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS: అందుకే ప్రగతిభవన్‌లో ఉంటున్నాం.. సంచలన విషయాలు బయట పెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

మమ్మల్ని ఎవరు నిర్బంధించలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. చంపేస్తామంటూ తమకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని బాలరాజు ఆందోళన వ్యక్తం చేశారు.

TRS: అందుకే ప్రగతిభవన్‌లో ఉంటున్నాం.. సంచలన విషయాలు బయట పెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
Trs Mla Guvwala Balaraju
Sanjay Kasula
|

Updated on: Nov 15, 2022 | 7:19 PM

Share

ఫాంహౌస్ కేసు అనంతరం తొలిసారి నలుగురు ఎమ్మెల్యేలు మీడియాకు మరోసారి కలిసి కనిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడారు. మమ్మల్ని ఎవరు నిర్బంధించలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. చంపేస్తామంటూ తమకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని బాలరాజు ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ కోసమే మమ్మల్ని ప్రగతిభవన్‌లో ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే ప్రగతిభవన్‌లో ఉంటున్నామని అన్నారు. మమ్మల్ని ఇబ్బందిపెట్టే ఎవరినీ వదిలిపెట్టమని ఎమ్మెల్యే బాలరాజు హెచ్చరించారు. సీఎం కేసీఆర్ వదిలిన బాణంగా ప్రజా క్షేత్రంలో పనిచేస్తామని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు.

అయితే తన నియోజకవర్గంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.100కోట్లు తీసుకుని ఎటో వెళ్లిపోయానని నియోజకవర్గంలో నాపై పోస్టర్లు వేసిన వ్యక్తుల రాజకీయ జీవితం భూస్థాపితం అవుతుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశం వెనుకబడిపోతోందని విమర్శించారు. దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరముందన్నారు. తమను బెదిరింపులకు గురిచేసిన వారికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం