TRS vs BJP: ‘దళితులతో కాళ్లు కడిగించుకుంటారా.. వెంటనే క్షమాపణలు చెప్పండి..’ : మాజీ మంత్రి

|

Jul 30, 2021 | 5:45 PM

TRS vs BJP: తెలంగాణలోని దళిత ప్రజలకు ఈటెల రాజేందర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు.

TRS vs BJP: ‘దళితులతో కాళ్లు కడిగించుకుంటారా.. వెంటనే క్షమాపణలు చెప్పండి..’ : మాజీ మంత్రి
Danam Nagender
Follow us on

TRS vs BJP: తెలంగాణలోని దళిత ప్రజలకు ఈటెల రాజేందర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. ఈటెల రాజేందర్ బామ్మర్ది దళితులను అవమానకరంగా తిడుతుంటే, ఈటెల ఏమో దళితులతో కాళ్ళు కడిగించుకుంటున్నారు అని ఫైర్ అయ్యారు. శుక్రవారం నాడు ఖైరతాబాద్ నియోజకవర్గం వెంకటేశ్వర కాలనీ డివిజన్‌లో నూతన ఆహార భద్రతా కార్డులను స్థానిక కార్పొరేటర్ మన్నే కవిత గోవర్ధన్ రెడ్డి తో కలిసి లబ్దిదారులకు అందించారు. ఈ సందర్బంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి వారికీ రేషన్ కార్డ్స్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఈ తెల్ల రేషన్ కార్డుల వల్ల కేవలం సరుకులు తీసుకోడం మాత్రమే కాకుండా, ఈ కార్డు ఉన్న వాళ్లకు హెల్త్ కార్డ్స్ ఇవ్వడం, సీఎం రిలీఫ్ ఫండ్‌కు కూడా అర్హులుగా ఉంటారని తెలిపారు.

ఇదే సమయంలో హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో రాజకీయ అంశాలపై దానం నాగేందర్ స్పందించారు. ‘దళిత బంధు’ అనేది ఒక హుజూరాబాద్‌లో మాత్రమే ఇస్తున్నారంటూ విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని దానం ఫైర్ అయ్యారు. కానీ కొత్త ప్రాజెక్టు ఏది ప్రారంభించినా పైలెట్ ప్రాజెక్ట్‌ మాదిరిగా తీసుకుని ప్రారంభిస్తారని అన్నారు. ఆ తరువాత దానిని రాష్ట్రం మొత్తం అనుసరించడం జరుగుతుందని దానం పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని అన్నారు. ఈటెల రాజేందర్ వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని, హుజూరాబాద్‌లో ప్రజలందరూ కలిసి ఈటెల రాజేందర్‌కి గుణపాఠం చెప్పడం ఖాయం అని అన్నారు.

Also read:

PV Sindhu: సింధుకి అది చాలా హెల్ప్ అయింది అని చెప్పిన తండ్రి రమణ.. వీడియో

Jr.NTR: తహశీల్దార్ ఆఫీస్‏లో జూనియర్ ఎన్టీఆర్ సందడి.. రావడానికి పెద్ద కారణమే ఉందట..

Peddireddy: టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి.. కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్