TRS Leaders Counter: 19 కేసుల్లో నేరస్తుడిని పరామర్శిస్తారా?.. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ కౌంటర్..

TRS Leaders Counter: జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు చేసిన హడావుడిపై టీఆర్ఎస్ పార్టీ..

TRS Leaders Counter: 19 కేసుల్లో నేరస్తుడిని పరామర్శిస్తారా?.. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ కౌంటర్..
Follow us

|

Updated on: Jan 02, 2021 | 8:17 PM

TRS Leaders Counter: జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు చేసిన హడావుడిపై టీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలోఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.. కాంగ్రెస్ నేతలపై విమర్శల వర్షం కురిపించారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. 19 కేసుల్లో నిందితుడు జైలు పాలయితే అలాంటి నాయకుడిని పరామర్శించడం కోసం వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన స్థాయి దిగజారిపోయేలా ప్రవర్తించారని విమర్శించారు. ఒక రౌడీ షీటర్ జైలు పాలయితే.. అలాంటి వారిని సమర్ధించడం సిగ్గుచేటని ఘాటైన వ్యాఖ్యలతో ఉత్తమ్, కోమటిరెడ్డికి కౌంటర్ అటాక్ ఇచ్చారు.

జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న నేరస్తుడని ఆరోపించారు. జంగా పది హత్య కేసులలో నిందితుడని ఆరోపించారు. రౌడీషీటర్ గా ముద్రపడి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నగర బహిష్కరణకు గురైన నేరస్థుడిని సమర్ధించడం సిగ్గుచేటని విమర్శించారు. జంగా రాఘవరెడ్డిపై 19 కేసులున్నాయని, అలాంటి నిందితుడిని పరామర్శించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు రావడం వారి దిగజారుడు తనానికి నిదర్శనం అని దుయ్యబట్టారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పై వారు చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న ఎమ్మెల్యేలు.. రౌడీ షీట్ ఉన్న వ్యక్తికి టీపీసీసీ అధ్యక్షుడు మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. 19 కేసులున్న నేరస్తుడి కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి మతిలేని మాటలు మాట్లాడి తన స్థాయి తగ్గించుకున్నారని విమర్శించారు. ఈ అరెస్ట్ ను అడ్డం పెట్టుకొని వరంగల్‌లో రాజకీయ లబ్ది పొందాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిందని, జాకీ పెట్టి లేపినా ఆ పార్టీ లేవదని ఎద్దేవా చేశారు.

Also read:

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం: తరిస్తోన్న భక్తజనం, రేపటితో ముగియనున్న ఏకాదశి ఉత్సవాలు

Akshay Kumar: అక్షయ్‌ ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది.. ఫోన్‌ ఛార్జింగ్‌ పెడదామని వెళితే..