టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం: రాజకీయ లబ్దికోసం కొత్త నాటకాలు మొదలుపెట్టారన్న మంత్రి ఎర్రబెల్లి

దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తుంటే.. కొందరు నేతలు రాజకీయ లబ్దికోసం కొత్త నాటకాలు మొదలుపెట్టారని మంత్రి ఎర్రబెల్లి..

టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం: రాజకీయ లబ్దికోసం కొత్త నాటకాలు మొదలుపెట్టారన్న మంత్రి  ఎర్రబెల్లి
Follow us

|

Updated on: Jan 02, 2021 | 9:05 PM

దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తుంటే.. కొందరు నేతలు రాజకీయ లబ్దికోసం కొత్త నాటకాలు మొదలుపెట్టారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. ఇప్పుడు పిచ్చికూతలు కూస్తున్న ప్రతిపక్ష నేతలు వరంగల్ వరదల్లో మునిగినప్పుడు ఎక్కడ పోయారని ప్రశ్నించారు. వరంగల్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రతిపక్ష పార్టీలపై ఎర్రబెల్లి తీవ్రస్థాయిలో మండి పడ్డారు. హన్మకొండలోని అభిరామ్ గార్డెన్స్ లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తో పాటు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

వరంగల్ లో రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టండని పార్టీశ్రేణులకు ఎర్రబెల్లి  ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.  వాళ్ళు అబద్ధాలు చెప్పడంలో నంబర్ వన్ అని విమర్శించిన ఆయన.. ఏరోజూ కంటికి కనపడని వాళ్ళు కూడా ఈ రోజు వరంగల్ కు వస్తున్నారంటే ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. దేశంలో ఎక్కడాలేని పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నామని, వరంగల్ కు వరదలు వస్తే మేం ప్రతి ఇంటికి వెళ్ళి బాధితులను పరామర్శించాం.. ప్రతిపక్షాలు కనుచూపు మేరకైనా కనిపించాయా అని ప్రశ్నించారు. వరంగల్ లో ఏరోజూ కంటికి కనిపించని నేతలు.. త్వరలో GWMC ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు పిచ్చి కూతలు కూస్తున్నారని ఆరోపించారు. ఆ నేతలు వరదలు – కరోనా సమయంలో ఎక్కడికి పోయారని నిలదీశారు.. బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు చెబుతున్నారని,  అలాంటి పార్టీ నేతలను ప్రజలు నిలదీయాలని కోరారు.