Telangana: ల్యాండ్ సర్వే కోసం వెళ్లిన తహాసీల్దార్.. తరిమి తరిమి కొట్టిన గిరిజనులు..

|

Jun 19, 2023 | 8:53 AM

స్థల పరిశీలనకు వచ్చిన తహశీల్దార్‌పై తండావాసులు తిరగబడ్డారు. సర్వే చేయొద్దని అక్కడి నుంచి పరుగెత్తించి.. పిడిగుద్దులతో దాడి చేశారు. మహబూబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana: ల్యాండ్ సర్వే కోసం వెళ్లిన తహాసీల్దార్.. తరిమి తరిమి కొట్టిన గిరిజనులు..
Warangal Mro
Follow us on

స్థల పరిశీలనకు వచ్చిన తహశీల్దార్‌పై తండావాసులు తిరగబడ్డారు. సర్వే చేయొద్దని అక్కడి నుంచి పరుగెత్తించి.. పిడిగుద్దులతో దాడి చేశారు. మహబూబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్​జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్​కార్యాలయం సమీపంలో ప్రభుత్వ స్థలం సర్వే నంబర్​ 551లో కోర్టు కాంప్లెక్స్​నిర్మాణం కోసం భూసేకరణకు సర్వే, రెవెన్యూ అధికారులు వెళ్లారు. అయితే, వారి భూసేకరణను గిరిజనులు అడ్డుకున్నారు. దీంతో గిరిజనులకు, రెవెన్యూ అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

వివాదం ఎక్కువగా ముదరకుండా అక్కడి నుంచి రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. ఈ క్రమంలో మండల తహశీల్దార్‌ హుమానియన్‌పై గిరిజనులు దాడి చేశారు. స్థల పరిశీలనకు వెళ్లిన తహశీల్దార్‌ను తండావాసులు తరిమి.. తరిమి కొట్టారు. సర్వే చేయొద్దని అక్కడి నుంచి పరుగెత్తించి కొట్టారు ఇద్దరు యువకులు. పిడిగుద్దులతో దాడి చేశారు. యువకుల దాడిలో తహశీల్దార్‌ హుమానియన్‌కు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. యువకులు రాళ్లతో దాడి చేశారన్నారు తహశీల్దార్‌ హుమానియన్‌. దాడి చేసిన యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న వారు సెల్​ఫోన్‌లలో రికార్డు చేశారు. అనంతరం కోర్టు కాంప్లెక్స్​నిర్మాణ స్థలాన్ని హైకోర్టు జడ్జి పరిశీలించారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని.. విచారణ చేపట్టారు. దాడి చేసిన ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..