TS Gurukula Jobs: 9,210 గురుకుల టీచర్‌ పోస్టులకు 2.66 లక్షల దరఖాస్తులు.. టీజీటీ పోస్టులకు పొటెత్తిన అప్లికేషన్లు

|

May 30, 2023 | 1:43 PM

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయుల పోస్టులకు తొమ్మిది ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసింది. ఈ పోస్టులకు ఏప్రిల్‌ 17 నుంచి మే 27 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా..

TS Gurukula Jobs: 9,210 గురుకుల టీచర్‌ పోస్టులకు 2.66 లక్షల దరఖాస్తులు.. టీజీటీ పోస్టులకు పొటెత్తిన అప్లికేషన్లు
TS Gurukula Jobs
Follow us on

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయుల పోస్టులకు తొమ్మిది ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసింది. ఈ పోస్టులకు ఏప్రిల్‌ 17 నుంచి మే 27 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.66 లక్షల మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు గురుకుల నియామక బోర్డు తెల్పింది. అత్యధికంగా టీజీటీ, పీజీటీ పోస్టులకు కలిపి 1.6 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. టీజీటీ పోస్టులు నాలుగు వేలు ఉండగా.. ఈ పోస్టులకు మాత్రమే వచ్చిన దరఖాస్తులు లక్షకు చేరువలో ఉన్నాయి. పీజీటీ పోస్టులకు దరఖాస్తుల సంఖ్య 60 వేలు దాటాయి.

ఒకే అభ్యర్థి గరిష్ఠంగా ఏడు పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో కొందరు అభ్యర్ధులు తాము అర్హత కలిగిన అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉద్యోగాలకు ఓటీఆర్‌ల సంఖ్య 1.5 లక్షలకుపైగా వచ్చాయి. చివరి రోజున సర్వర్ బిజీ రావడంతో అభ్యర్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలుత ఫీజు చెల్లించి, తర్వాత ఆన్‌లైన్లో దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉండటంతో కొందరు అభ్యర్థులు ఫీజు చెల్లించాక, వారి దరఖాస్తును పూర్తి చేసేందుకు సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. ఇలా దాదాపు ఆరు వేల మంది ఫీజు చెల్లించి, దరఖాస్తు పూర్తికాకుండానే గడువు ముగిసింది. ఆ తర్వాత ఫీజు చెల్లించిన వారికి 24 గంటల అదనపు సమయం ఇచ్చినా మరో మూడు వేల మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గడువు పొడిగించాలని కోరినప్పటికీ గురుకుల బోర్డు నిరాకరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.