TS Gurukul PGT Notification 2023: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..1,276 గురుకుల పీజీటీ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

|

Apr 23, 2023 | 5:18 PM

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో 1,276 పీజీటీ పోస్టుల భర్తీకి గురుకుల నియామక మండలి అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం సోమవారం (ఏప్రిల్ 24) నుంచి ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మే 24 వరకు దరఖాస్తు చేసుకోవడానికి..

TS Gurukul PGT Notification 2023: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..1,276 గురుకుల పీజీటీ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
TS Gurukul PGT Notification 2023
Follow us on

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో 1,276 పీజీటీ పోస్టుల భర్తీకి గురుకుల నియామక మండలి అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం సోమవారం (ఏప్రిల్ 24) నుంచి ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మే 24 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. రాత పరీక్ష ఆధారంగా పీజీటీ పోస్టులకు ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి 9 నోటిఫికేషలన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో 868 డిగ్రీ లెక్చరర్‌ పోస్టుఉల, 4020 టీజీటీ పోస్టులు, 2008 జూనియర్‌ లెక్చరర్ పోస్టులు, 434 లైబ్రేరియన్‌, 275 ఫిజికల్‌ డైరెక్టర్‌, 134 ఆర్ట్స్‌, 92 క్రాఫ్ట్‌, 124 మ్యూజిక్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిల్లో జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో పోస్టులకు ఏప్రిల్ 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. టీజీటీ మినహా మిగతా అన్ని పోస్టులకు అధికారిక నోటిఫికేషన్లు ఏప్రిల్ 24 నాటికి వెబ్‌సైట్లో అందుబాటులో పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాత పరీక్ష విధానం ఇలా..

మొత్తం 300 మార్కులకు మూడు పేపర్లకు రాత పరీక్ష నిర్వహిస్తారు. పేపర్‌-1లో జనరల్‌స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌, ఇంగ్లిష్‌ పరిజ్ఞానంపై 100 మార్కులకు ఉంటుంది. పేపర్‌-2లో బోధన పద్ధతులపై 100మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పేపర్‌-3లో సబ్జెక్టు విషయ పరిజ్ఞానంపై 100 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.