Telangana: ట్రాన్స్ జెండర్‌ల బోనం.. కరోనా అంతం కావాలని మొక్కులు

నిర్మల్ జిల్లా కేంద్రంలో ట్రాన్స్ జెండర్లు బుధవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కరోనా మూడోదశ తీవ్రమవుతున్న తరుణంలో ప్రజలంతా క్షేమంగా ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ అడెల్లి మహాపోచమ్మకు బోనం సమర్పిస్తున్నట్లు తెలిపారు.

Telangana: ట్రాన్స్ జెండర్‌ల బోనం.. కరోనా అంతం కావాలని మొక్కులు
Transgender Prayers

Updated on: Jan 29, 2022 | 12:34 PM

Bonalu:బోనాలు అనగానే చిన్నా పెద్ద.. ఆడ మగ తేడా లేకుండా అందరూ కలిసి అమ్మవారి ఆలయాలకు తరలివెళ్లడం, నైవేద్యాలను సమర్పించడం మనమందరం చూస్తూనే ఉంటాం. అయితే నిర్మల్ జిల్లా(Nirmal District)కేంద్రంలో జరిగిన ఈ వేడుక ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. దీనికి కారణం ఉత్సవాలను నిర్వహించింది ట్రాన్స్ జెండర్స్ కావడమే. నిర్మల్ పట్టణంతో పాటు పెద్దపల్లి(Peddapalli), నిజామాబాద్(Nizamabad), గజ్వేల్, బోధన్, ఆర్మూర్ తదితర ప్రాంతాలకు చెందిన పలువురు ట్రాన్స్ జెండర్‌లు జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్ పేటకు తరలివచ్చారు. నైవేద్యంతో సిద్ధం చేసిన బోనాల కుండలకు మొదటగా పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీలో బాజాభజంత్రీలు నడుమ ప్రదర్శన చేపట్టారు. సాంప్రదాయ వేషధారణ.. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ చేసిన నృత్యాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం సారంగాపూర్ మండలంలోని అడెల్లి పోచమ్మకు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కరోనా మొదటి దశ, రెండవ దశలో అనేక మందిని బలిగొందని, మూడవ దశ తీవ్రం అవుతున్న నేపథ్యంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని తాము అమ్మవారికి బోనం సమర్పించినట్లు ట్రాన్స్‌ జెండర్లు చెబుతున్నారు. అందరూ క్షేమంగా ఉండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని పూజించామన్నారు. జిల్లాలో మొట్ట మొదటిసారిగా అమ్మవారికి ట్రాన్స్ జెండర్లు బోనాలు సమర్పించడం విశేషం.

Also Read: ఆ ప్రాంతంలో మామిడి, జామచెట్లకు గుమ్మడికాయలు.. ఈ విచిత్రం వెనుక సీక్రెట్ ఇదే..

‘ప్రేమతో డబ్బు, బంగారం ఇచ్చా.. తనేమో హ్యాండిచ్చింది’.. యువకుడు ఆత్యహత్య