AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆట కోసం వెళ్లారు.. ఎంతకు తిరిగిరాకపోవడంతో ఊర చివర బావిలో చూడగా..

ఆ బాల్య స్నేహితులు.. ఒకే దారిలో బడికి వెళ్లేవారు.. ఒకే మైదానంలో ఆడుకునేవారు.. కానీ.. చివరికి ఒకే సారి ప్రాణాలు కోల్పోయారు. ఆట కోసం వెళ్లిన పిల్లల అడుగులు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాయి. ఒక చిన్న సరదా ఆ రెండు కుటుంబాల్లో ఎప్పటికీ తీరని విషాదాన్ని మిగిల్చింది.

Telangana: ఆట కోసం వెళ్లారు.. ఎంతకు తిరిగిరాకపోవడంతో ఊర చివర బావిలో చూడగా..
Two Schoolboys Drown In Well At Thipparthy
M Revan Reddy
| Edited By: |

Updated on: Jul 05, 2026 | 2:30 PM

Share

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఖాజీరామారంకు చెందిన నరేష్ సరిత దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరిలో చిన్నవాడు బోల్గూరి వినయ్. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న వినయ్ (10) 5వ తరగతి చదువుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన బొంగురాల శంకర్ లింగమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో చిన్నవాడైన బొంగరాల మనీ భార్గవ్ (14) స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ ఇద్దరు ప్రతిరోజూ కలిసి ఆడుతూ పాడుతూ స్కూలుకు వెళ్లి వస్తుండేవారు. బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. రోజూ మాదిరిగానే ఈ ఇద్దరు పిల్లలు కూడా పాఠశాలకు వెళ్లి ఇంటికి వచ్చారు.

సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు రాత్రి అయినా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గ్రామస్తులంతా కలిసి వెతికినా వారి జాడ కనిపించలేదు. చివరకు గ్రామంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఇద్దరూ బావి వైపు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని చూడగా బావి వద్ద పిల్లల చెప్పులు కనిపించాయి. ఆ క్షణం నుంచే అందరిలోనూ ఆందోళన మరింత పెరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు గంటలపాటు శ్రమించి బావిలో నుంచి ఇద్దరు పిల్లల మృతదే హాలను వెలికితీశారు.

తమ పిల్లలు తిరిగి వస్తారని ఎదురుచూసిన తల్లిదండ్రులకు చివరకు.. విగత జీవులుగా కనిపించడంతో వారి ఆర్తనాదాలు అరణ్య రోదనగా మారింది. పిల్లల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబాల కలలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఎప్పుడూ సందడిగా ఉండే ఆ రెండు ఇళ్లు ఇప్పుడు కన్నీటి సంద్రాలుగా మారాయి. గ్రామంలోని బావులు, చెరువుల వద్ద చిన్నారులు వెళ్లకుండా తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ విషాదం మరోసారి గుర్తు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తిప్పర్తి ఎస్ఐ శివశంకర్ తెలిపారు.

Follow Us
పాము, ముంగిస పగ.. 99 శాతం మందికి తెలియని నిజం
పాము, ముంగిస పగ.. 99 శాతం మందికి తెలియని నిజం
ఆట కోసం వెళ్లారు.. ఎంతకు తిరిగిరాకపోవడంతో ఊర చివర బావిలో..
ఆట కోసం వెళ్లారు.. ఎంతకు తిరిగిరాకపోవడంతో ఊర చివర బావిలో..
పిడుగు పడినా ఏమీ కాదు.. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే బిజ్లీ మహాదేవ్
పిడుగు పడినా ఏమీ కాదు.. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే బిజ్లీ మహాదేవ్
61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్న ఆమిర్ ఖాన్.. ఫొటోస్ ఇదిగో
61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్న ఆమిర్ ఖాన్.. ఫొటోస్ ఇదిగో
తింటే హైదరాబాదీ బిర్యానీనే తినాలి.. నోట్లో నీళ్లూరాల్సిందే..
తింటే హైదరాబాదీ బిర్యానీనే తినాలి.. నోట్లో నీళ్లూరాల్సిందే..
గోడ పక్కనే వింత శబ్దాలు.. జూమ్ చేసి చూడగా ఒళ్ళు గగుర్పొడిచే సీన్
గోడ పక్కనే వింత శబ్దాలు.. జూమ్ చేసి చూడగా ఒళ్ళు గగుర్పొడిచే సీన్
అసలే వర్షాకాలం,హఠాత్తుగా నాగుపాము ఎదురైతే ఏం చేయాలి?సేఫ్టీ టిప్స్
అసలే వర్షాకాలం,హఠాత్తుగా నాగుపాము ఎదురైతే ఏం చేయాలి?సేఫ్టీ టిప్స్
ఇంటి ప్రధాన ద్వారం వద్ద డోర్‌మ్యాట్ ఇలా ఉంటే లక్ష్మీ కటాక్షం
ఇంటి ప్రధాన ద్వారం వద్ద డోర్‌మ్యాట్ ఇలా ఉంటే లక్ష్మీ కటాక్షం
హీరో అవుతానంటే మొహం మీదే పొమ్మన్నా.. ఇప్పుడు స్టార్ అయిపోయాడు
హీరో అవుతానంటే మొహం మీదే పొమ్మన్నా.. ఇప్పుడు స్టార్ అయిపోయాడు
వర్షాకాలంలో ఈ మొక్క ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరమే రాదు
వర్షాకాలంలో ఈ మొక్క ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరమే రాదు