
అతనికి 35.. మైనర్ బాలికకు 16 ఏళ్లు.. లాడ్జిలో శవాలై కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటన భద్రాచలంలో జరిగింది. మైనర్ బాలికతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అతడు.. ఆమెతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అశ్వాపురం మండలానికి చెందిన 16 ఏళ్ల బాలికకు, కుకునూరు మండలం రావిగూడెం గ్రామానికి చెందిన 35 ఏళ్ల రవికి మధ్య కొన్ని రోజులుగా ప్రేమాయణం నడుస్తోంది. రవికి ఇప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ విషయంపై గతంలో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రవిని జైలుకు పంపించారు. రెండు నెలలు జైలులో ఉన్న రవి, బయటకు వచ్చాక కూడా తన తీరు మార్చుకోలేదు.
జైలు జీవితం తర్వాత కూడా రవి తన భార్య, పిల్లలను పట్టించుకోకుండా, అదే సంబంధాన్ని కొనసాగించాడు. కుటుంబంలో గొడవలు జరుగుతుండటంతో రవి, ఆ మైనర్ బాలికతో కలిసి భద్రాచలం చేరుకున్నాడు. అక్కడ ఒక ప్రైవేట్ లాడ్జిలో రెండు రోజులు గడిపిన తర్వాత ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు, వారిని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోపే రవి చనిపోయాడు. బాలిక కూడా ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన సమాజంలో వివాహేతర సంబంధాలు, మైనర్లతో సంబంధాలపై ఉన్న సమస్యలను మరోసారి గుర్తు చేస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..