Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇదే అంశంపై ఇవాళ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. విభేదాలు ఉంటే అధిష్టానం, ఇంచార్జ్‌కి లేఖలు రాయవచ్చన్నారు. పార్టీ అంతర్గత విషయాలను బహిర్గతం చేయొద్దని పార్టీ నేతలకు హితవు చెప్పారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డిని క్రమశిక్షణ కమిటీ కి పిలిచి మాట్లాడతామన్నారు. జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించినట్లుగా భావిస్తున్నామన్నారు. ఆయన్ను త్వరలోనే కమిటీ ముందుకు పిలుస్తామన్నారు. అయితే, జగ్గారెడ్డిపై చర్యలు తమ పరిధి లోకి రావని చిన్నారెడ్డి తెలిపారు. సోనియా గాంధీకి రాసిన లేఖ ఎలా లీక్ అవుతుందని చిన్నారెడ్డి ప్రశ్నించారు. రాబోయే కొత్త సంవత్సరంలో కొత్త సాంస్కృతిని ఆచరిస్తారని ఆశిస్తున్నామమన్నారు.
జనగామ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవ రెడ్డి ఇచ్చిన నోటీస్ లపై వివరణ ఇచ్చారని చిన్నారెడ్డి తెలిపారు. మళ్లీ ఒక్కసారి జంగా రాఘవ రెడ్డితో మాట్లాడాల్సి ఉందని కమిటీ భావవిస్తుందన్నారు. మంచిర్యాల జిల్లా మాజీ ఎమ్మెల్సీ ప్రేం సాగర్ రావ్ అనుచరులు విహెచ్ వాహనం పై దాడి చేయడం జరిగింది. ఈ ఇష్యులో డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్సీ ప్రేం సాగర్ రావ్ లతో లోతుగా చర్చించాలని భావిస్తున్నామని తెలిపారు. దాడి సమయంలో ప్రేమ్ సాగర్ రావ్ ప్రత్యేక్షంగా అక్కడ లేరన్నారు. మహబూబాబాద్ జిల్లాలో అలాంటి పరిస్థితి ఉన్నట్లు కమిటీ దృష్టికి వచ్చింది. 2018 ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే పార్టీ వారిని సస్పెండ్ చేసిందని చిన్నారెడ్డి గుర్తు చేశారు. సస్పెండైన వారు మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తామని కోరినట్లు చిన్నారెడ్డి తెలిపారు. ఈ విజ్ఞప్తులను టీపీసీసీకి అందజేస్తామని, పీసీసీ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.
ఇవి కూడా చదవండి:
Happy New Year 2022: అందరికంటే ముందే మేమొచ్చాం.. 2022లోకి తొలి అడుగుపెట్టిన దేశం ఇదే..
Good News: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. న్యూ ఇయర్ కానుకగా బ్రాండెడ్ మద్యం..