Revanth Reddy: ఇందిరాపార్క్‌ దగ్గర రెండ్రోజుల దీక్ష.. ప్రజా సమస్యలపై పోరాటానికి కార్యాచరణ ప్రకటించిన రేవంత్‌

|

Nov 20, 2022 | 7:41 AM

రుణమాఫీ హామీ కింద 47లక్షల మంది రైతులకు 25వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందన్న రేవంత్‌, దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని కేడర్‌కి పిలుపునిచ్చారు. అలాగే, పోడు భూముల సమస్యపై పోరాటం చేయాలని సూచించారు.

Revanth Reddy: ఇందిరాపార్క్‌ దగ్గర రెండ్రోజుల దీక్ష.. ప్రజా సమస్యలపై పోరాటానికి కార్యాచరణ ప్రకటించిన రేవంత్‌
TPCC President Revanth Reddy
Follow us on

భవిష్యత్‌ కార్యాచరణ, ప్రజా పోరాటాలపై కేడర్‌కు దిశానిర్దేశం చేశారు రేవంత్‌రెడ్డి. డిస్ట్రిక్ట్‌ లీడర్స్‌తో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించిన పీసీసీ చీఫ్‌, ఏఏ అంశాలపై ఫైట్‌ చేయాలో డైరెక్షన్స్‌ ఇచ్చారు. మెయిన్‌గా రైతు రుణమాఫీ, పోడు భూములు, ధాన్యం కొనుగోళ్లపై పోరాటం చేయాలని సూచించారు. రుణమాఫీ హామీ కింద 47లక్షల మంది రైతులకు 25వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందన్న రేవంత్‌, దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని కేడర్‌కి పిలుపునిచ్చారు. అలాగే, పోడు భూముల సమస్యపై పోరాటం చేయాలని సూచించారు. గిరిజనులకు అండగా ఉంటూ పోడు పోరాటం చేయాలన్నారు రేవంత్‌. అలాగే, ధాన్యం కొనుగోళ్లపైనా ఫైట్‌ చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలను ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి, ఆ తర్వాత పోరాటం మొదలుపెట్టనున్నట్టు తెలిపారు రేవంత్‌. మొదట, అన్ని మండల కేంద్రాల్లో, ఆ తర్వాత జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి, కలెక్టరేట్లను ముట్టడించాలని దిశానిర్దేశం చేశారు. సోమవారం మొదలయ్యే ఈ నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గోవాలన్నారు రేవంత్‌. డిసెంబర్‌ ఐదు వరకు అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ఆందోళనలుచేసి, చివరిగా హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ దగ్గర రెండ్రోజులపాటు దీక్ష చేయనున్నారు కాంగ్రెస్‌ నేతలు.

కాగా ఈ సమావేశంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌పై కీలక కామెంట్స్‌ చేసిన రేవంత్‌రెడ్డి.. వెస్ట్‌ బెంగాల్‌ తరహా పాలిటిక్స్‌ను తెలంగాణలో చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై ప్రజలను అప్రమత్తం చేస్తామంటూ చెప్పుకొచ్చారు. ప్రజాసమస్యలు చర్చకు రాకుండా ఈ రెండు పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయంటూ మండిపడ్డారు రేవంత్‌. గతంలో నయీమ్‌ అండ్‌ డ్రగ్స్‌ కేసుల్లో అదే జరిగిందని, ఇప్పుడు కూడా వివాదాస్పద అంశాలను తెరపైకి తీసుకొచ్చి ప్రజాసమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..