వచ్చే ఎన్నికల నాటికి BRS ముఖచిత్రం ఉండదు- టీవీ9తో మహేష్ కుమార్ గౌడ్

రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‌ పార్టీ పరిస్థితిపై టీవీ9 క్రాస్‌ఫైర్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో BRS పార్టీ ముఖచిత్రం ఉండదని ఆయన అన్నారు. బీఆర్ఎస్‌లో నాలుగు ముక్కలాట నడుస్తుందని.. వారిలో వారికే పడట్లేదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

వచ్చే ఎన్నికల నాటికి BRS ముఖచిత్రం ఉండదు- టీవీ9తో మహేష్ కుమార్ గౌడ్
Mahesh Goud Coments On Brs

Updated on: Aug 17, 2025 | 8:54 PM

టీవీ9 క్రాస్‌ఫైర్‌లో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‌ పార్టీ పరిస్థితిపై తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో BRS పార్టీ ముఖచిత్రం ఉండదని ఆయన అన్నారు. బీఆర్ఎస్‌లో నాలుగు ముక్కలాట నడుస్తుందని..కేటీఆర్, కవితలకు అస్సలు పడట్లేదని.. మరో పక్క హరీష్ రావు అదునుకోసం చూస్తున్నాడని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవన్నీ భరించలేకనే కేసీఆర్‌ ఫాంహౌజ్‌కే పరిమితమయ్యారు మహేష్‌ గౌడ్‌ చెప్పుకొచ్చారు.

మరోవైపు బీఆర్ఎస్‌ పరిస్థి అర్థమై చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రేడీగా ఉన్నారని ఆయన అన్నారు. కానీ తాము దానిపై తాము ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోదని ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల కవిత కాంగ్రెస్‌లోకి వెళ్తుందనే ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. కవితను కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని టీవీ9 క్రాస్‌ఫైర్‌లో టి.పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్ అన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.