AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR – Amit Shah: అమిత్ షాతో- భీం భేటీ.. అసలు రహస్యం ఇదేనంటూ తెలుగు రాష్ట్రాల్లో డీప్ డిస్కర్షన్..!

NTR - Amit Shah: జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా భేటీ అయ్యారు. అయితే, ఈ భేటీ వెనక ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఇది కేవలం సినిమాలకే పరిమితమా?

NTR - Amit Shah: అమిత్ షాతో- భీం భేటీ.. అసలు రహస్యం ఇదేనంటూ తెలుగు రాష్ట్రాల్లో డీప్ డిస్కర్షన్..!
Amit Shah Jr Ntr
Shiva Prajapati
|

Updated on: Aug 22, 2022 | 8:22 AM

Share

NTR – Amit Shah: జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా భేటీ అయ్యారు. అయితే, ఈ భేటీ వెనక ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఇది కేవలం సినిమాలకే పరిమితమా? లేక రాజకీయ ప్రమేయం ఏదైనా ఉందా? అన్న చర్చ సర్వత్రా జోరుగా నడుస్తోంది. ఇంతకీ ఇద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది? ఇప్పుడిదే హాట్ టాపిక్.. ఇటు తెలుగు సినీ వర్గాల్లో, అటు పొలిటికల్ వర్గాల్లో అమిత్ షా- బాద్షా భేటీ పైనే సర్వత్రా చర్చ. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా భేటీ వెనక దాగిన రహస్యమేంటన్న డిస్కషన్ ఒకింత డీప్ గానే జరుగుతోంది.

వాస్తవానికి అమిత్ షా టైట్ షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అసలు లేనే లేదు. కానీ, షా హైదరాబాద్ వచ్చాక.. సడెన్ గా వచ్చిన మార్పు చేర్పుల్లో భాగంగా.. జూనియర్ ఎన్టీఆర్ సమావేశం ఒకటిగా మారిందని అంటున్నారు. అయితే ఇది ఇప్పటికిప్పుడు జరిగిన భేటీ కాదనీ.. మూడ్రోజుల ముందే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ గురించి వాకబు చేసినట్టు చెబుతున్నారు టీబీజేపీ చీఫ్ బండి సంజయ్.

ఇదిలాఉంటే నోవాటెల్‌లో ఇరువురు అరగంట పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చి ఉంటాయ్? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రచయిత, రాజ్యసభ సభ్యుడు- విజయేంద్రప్రసాద్ నుంచి ఆర్ఎస్ఎస్ మీద సినిమా- వెబ్ సీరిస్ ప్రకటన వెలువడ్డం తెలిసిందే. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఉండే అవకాశముందా? అన్న టాపిక్ బాగా హైలెట్ అవుతోంది. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే.. అది రాజకీయ ప్రాధాన్యతాంశంగా మారే అవకాశముంది. ఈ పరిస్థిలో జూనియర్ ఇలాంటి సాహసం చేస్తారా? అన్నది కూడా చర్చనీయాంశమైన అంశంగా మారింది.

రాజకీయంగానూ కాకరేపుతున్న అమిత్ షా – బాద్‌షా భేటీ. ఇప్పటికే ఏపీలో పవన్ కళ్యాణ్‌ తో.. టచ్ లో ఉంది బీజేపీ. అయితే పవన్- వచ్చే ఎన్నికల నాటికి తన మనసు మార్చుకున్న పక్షంలో.. ఏపీ బీజేపీ జూనియర్ ఎన్టీఆర్ ను తమ ప్రచారాస్త్రంగా వాడే అవకాశముందా? అన్న వాడీ వేడీ చర్చ కూడా సాగుతోంది. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ను ఆకర్షించే యత్నం చేస్తున్నారా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.

అయితే, ఇదే విషయాన్ని బండి సంజయ్ వద్ద ప్రస్తావించగా.. అలాంటిదేమీ లేదంటూనే ట్విస్ట్ ఇచ్చారు. సాధారణంగా భేటీ అయినంత మాత్రాన.. రాజకీయాల్లోకి ఆకర్షిస్తున్నట్టేనా? అని ఎదురు ప్రశ్నించారు బండి సంజయ్. అయితే మోదీకి ప్రస్తుతం ఉన్న ఫాలోయింగ్ ను బట్టీ చూస్తే.. ఎందరో సినీ ప్రముఖులు పార్టీలోకి వస్తున్నారనీ చెప్పుకొచ్చారాయన. వీటన్నింటిని బట్టీ చూస్తే షా- ఎన్టీఆర్ భేటీ వెనక దాగిన సీక్రెట్ ఏంటన్నది సస్పెన్స్ గా మారింది. అమిత్ షా జూనియర్ ను నటన పరంగా మాత్రమే మెచ్చుకున్నట్టు ఆయన ట్వీట్ల ద్వారా తెలుస్తోంది. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్న విషయం స్పష్టమవుతోంది. ఇక జూనియర్ సైతం ఈ భేటీపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇటు బండికి తెలీక- అటు ఎన్టీఆర్ సైతం ఇదీ అని చెప్పని పరిస్థితుల్లో.. ఊహాగానాలే తప్ప.. వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. ఈ విషయంపై ఎవరైనా నోరు విప్పితే తప్ప.. ఒక స్పష్టత రాదంటున్నారు తెలుగు సినీ రాజకీయ వర్గాల వారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రూ.లక్షకోట్లతో భారీప్రాజెక్ట్
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రూ.లక్షకోట్లతో భారీప్రాజెక్ట్
మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్..! బార్లు, రెస్టారెంట్లు బంద్..
మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్..! బార్లు, రెస్టారెంట్లు బంద్..
ఎల్పీజీ సిలిండర్లు వాడేవారికి కొత్త రూల్స్.. ఈ నెల నుంచే..
ఎల్పీజీ సిలిండర్లు వాడేవారికి కొత్త రూల్స్.. ఈ నెల నుంచే..
సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ..
సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ..
OTTలో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTTలో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులెప్పట్నుంచంటే?
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులెప్పట్నుంచంటే?
నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
బంగారం ధరలపై భారీ ఊరట.. మరోసారి పతనం.. నేటి రేట్లు ఇవే..
బంగారం ధరలపై భారీ ఊరట.. మరోసారి పతనం.. నేటి రేట్లు ఇవే..
ఈ రాశుల వారికి శుభవార్తలే.. శుభవార్తలు.. సోమవారం దిన ఫలాలు ఇదిగో
ఈ రాశుల వారికి శుభవార్తలే.. శుభవార్తలు.. సోమవారం దిన ఫలాలు ఇదిగో
చేపల కోసం గేలం వేస్తే.. వెన్నులో వణుకు పుట్టించే సీన్‌..!
చేపల కోసం గేలం వేస్తే.. వెన్నులో వణుకు పుట్టించే సీన్‌..!