AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెలబ్రిటీగా మారిన భారీ సముద్ర జీవి.. ఈ సీల్‌ కోసం కొత్త చట్టాలు తీసుకొచ్చిన ప్రభుత్వం!

సోషల్ మీడియాలో ఎన్నో వింతలు, అద్భుతాలు వైరల్ అవుతుంటాయి. అందులోనూ కొన్ని జంతువులు తమ అల్లరితో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి కోవకు చెందిందే ఆస్ట్రేలియాలోని నీల్ ది సీల్. దాదాపు 1,000 కిలోల బరువుండే ఈ భారీ సముద్ర జీవి ఇటీవల ఆస్ట్రేలియాలోని టాస్మానియా తీర ప్రాంతాల్లో సంచరిస్తూ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. అయితే దీని విపరీతమైన పాపులారిటీ, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా ప్రభుత్వం దీనికి ప్రత్యేక చట్టపరమైన రక్షణలను కల్పించింది.

సెలబ్రిటీగా మారిన భారీ సముద్ర జీవి.. ఈ సీల్‌ కోసం కొత్త చట్టాలు తీసుకొచ్చిన ప్రభుత్వం!
Viral Elephant Seal
Jyothi Gadda
|

Updated on: Nov 16, 2026 | 1:34 PM

Share

సోషల్ మీడియాలో ఎన్నో వింతలు, అద్భుతాలు వైరల్ అవుతుంటాయి. అందులోనూ కొన్ని జంతువులు తమ అల్లరితో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి కోవకు చెందిందే ఆస్ట్రేలియాలోని నీల్ ది సీల్. దాదాపు 1,000 కిలోల బరువుండే ఈ భారీ సముద్ర జీవి ఇటీవల ఆస్ట్రేలియాలోని టాస్మానియా తీర ప్రాంతాల్లో సంచరిస్తూ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. అయితే దీని విపరీతమైన పాపులారిటీ, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా ప్రభుత్వం దీనికి ప్రత్యేక చట్టపరమైన రక్షణలను కల్పించింది.

ఎవరు ఈ నీల్ ది సీల్?

టాస్మానియాలోని టాస్మాన్ పెన్సులాలో జన్మించిన ఈ సదరన్ ఎలిఫెంట్ సీల్, ప్రతి సంవత్సరం తీర ప్రాంత నగరాలకు వచ్చి విశ్రాంతి తీసుకోవడం, చర్మం మార్చుకోవడం చేస్తుంటుంది. అయితే ఇది క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 1,000 కిలోల బరువుకు చేరుకుంది. పరిమాణంలో పెరిగే కొద్ది ఇది నగరాల్లో రోడ్లపై పడుకోవడం, ట్రాఫిక్‌కు అడ్డుగా నిలబడటం, కంచెలను ఢీకొట్టి పాడుచేయడం వంటి పనులతో స్థానికంగా వార్తల్లో నిలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ కావడంతో దీనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు.

కొత్త చట్టపరమైన నిబంధనలు ఏమిటి?

నీల్ విపరీతమైన ప్రజాదరణ పొందడంతో, దానిని చూసేందుకు పర్యాటకులు, అభిమానులు ప్రమాదకర రీతిలో అతి దగ్గరకు వెళ్లడం ప్రారంభించారు. ఇది జంతువుకు, ప్రజలకు ప్రమాదకరమని భావించిన టాస్మానియా ప్రభుత్వం నవంబర్ 15న అధికారికంగా ఒక నూతన మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను ప్రకటించింది. ప్రజలు, పర్యాటకులు నీల్ లేదా ఇతర సముద్ర సీలులకు కనీసం 30 మీటర్ల దూరం పాటించాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించి సీలుకు దగ్గరగా వెళ్లినా, వాటిని ఇబ్బంది పెట్టినా చట్టపరమైన చర్యలు ఉంటాయని, భారీ జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు. కొందరు వ్యాపార సంస్థలు దీని ప్రజాదరణను తమ వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకుంటున్న నేపథ్యంలో, నీల్ ది సీల్ పేరును ట్రేడ్‌మార్క్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం, నిపుణుల హెచ్చరిక

ప్రతి ఒక్కరూ నీల్‌ను ప్రేమిస్తారు, అది చాలా పాపులర్. కానీ మనం దాని భద్రతను, అలాగే సమాజం భద్రతను గౌరవించాలి అని టాస్మానియా ప్రీమియర్ జెరెమి రాక్లిఫ్ పేర్కొన్నారు. కేవలం ఫోటోల కోసం లేదా సెల్ఫీలు దిగడం కోసం వన్యప్రాణుల ఆవాసాలను భంగం చేయడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతిని, వన్యప్రాణులను ఇష్టపడటం ఎంత ముఖ్యమో, వాటి స్వేచ్ఛకు, భద్రతకు భంగం కలగకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. టాస్మానియా ప్రభుత్వం తీసుకున్న ఈ సకాల నిర్ణయం నీల్ లాంటి అరుదైన వన్యప్రాణులను సురక్షితంగా కాపాడుకోవడానికి ఎంతో దోహదపడుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సెలబ్రిటీగా మారిన భారీ సముద్ర జీవి.. ఈ సీల్‌ కోసం కొత్త చట్టాలు
సెలబ్రిటీగా మారిన భారీ సముద్ర జీవి.. ఈ సీల్‌ కోసం కొత్త చట్టాలు
ఈ ఐదుగురికి షాక్ తప్పదా? రిలీజ్ చేసే యోచనలో ఫ్రాంచైజీలు
ఈ ఐదుగురికి షాక్ తప్పదా? రిలీజ్ చేసే యోచనలో ఫ్రాంచైజీలు
వీరికి అదృష్టమే అదృష్టం..ఈ నక్షత్రాల వారికి దశ తిరగడం ఖాయం!
వీరికి అదృష్టమే అదృష్టం..ఈ నక్షత్రాల వారికి దశ తిరగడం ఖాయం!
ఒకప్పుడు పాల వ్యాపారం వ్యాపారం, తర్వాత మెకానిక్..
ఒకప్పుడు పాల వ్యాపారం వ్యాపారం, తర్వాత మెకానిక్..
కార్తీక సోమవారం ఉపవాసం ముగిసిన తర్వాత ఏం తినాలి?
కార్తీక సోమవారం ఉపవాసం ముగిసిన తర్వాత ఏం తినాలి?
పంట గడ్డితో సబ్బులు తయారు చేయవచ్చా?శాస్త్రవేత్తల కొత్త విధానం ఇదే
పంట గడ్డితో సబ్బులు తయారు చేయవచ్చా?శాస్త్రవేత్తల కొత్త విధానం ఇదే
ఇంటి నిర్మాణం రోడ్డుకు ఎంత ఎత్తులో కట్టాలి? ఇలా అస్సలు చేయకండి!
ఇంటి నిర్మాణం రోడ్డుకు ఎంత ఎత్తులో కట్టాలి? ఇలా అస్సలు చేయకండి!
చిరంజీవి రిక్షావోడు సినిమా చూస్తున్న టైంలో ఆ విషాదం తెలిసింది..
చిరంజీవి రిక్షావోడు సినిమా చూస్తున్న టైంలో ఆ విషాదం తెలిసింది..
విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు
విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు
చాలా మందికి తెలియదు.. రూ.లక్ష జమ చేస్తే చాలు.. రూ.45 వేల వడ్డీ!
చాలా మందికి తెలియదు.. రూ.లక్ష జమ చేస్తే చాలు.. రూ.45 వేల వడ్డీ!