AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడి అడవులలో అద్భుతం.. 20 అంగుళాల ఎత్తుండే అరుదైన శిలీంద్రం గుర్తింపు!

చైనాలోని యున్నాన్ ప్రావిన్స్ అడవులలో శాస్త్రవేత్తలు ఒక వినూత్నమైన, అతిపెద్ద శిలీంధ్ర జాతిని కనుగొన్నారు. దీనికి డియాంజునస్ రెక్స్ అని పేరు పెట్టగా, దీనిని డి-రెక్స్ అని ముద్దుగా పిలుస్తున్నారు. భూమిపై డైనోసార్లు అంతరించిపోయిన కాలం నాటి, అనగా సుమారు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటి పరిణామ క్రమానికి దీని మూలాలు ముడిపడి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. దాదాపు 20 అంగుళాల (50 సెం.మీ.) ఎత్తు, సుమారు 5 పౌండ్ల బరువు వరకు పెరిగే ఈ జెయింట్ ఫంగస్, ఆస్కోమైకోటా వర్గానికి చెందిన వాటిలో అత్యంత ఎత్తైనదిగా రికార్డు సృష్టించింది.

అక్కడి అడవులలో అద్భుతం.. 20 అంగుళాల ఎత్తుండే అరుదైన శిలీంద్రం గుర్తింపు!
China Discovers Giant D Rex Fungus
Jyothi Gadda
|

Updated on: Nov 16, 2026 | 8:42 AM

Share

ప్రకృతి ఎప్పుడూ ఎన్నో వింతలను, అద్భుతాలను తనలో దాచుకుంటూనే ఉంటుంది. తాజాగా చైనా పరిశోధకులు అడవులలో సర్వే చేస్తున్న సమయంలో శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచే ఒక సరికొత్త భారీ శిలీంధ్ర జాతిని కనుగొన్నారు. కేవలం చూపులకే కాకుండా తన పరిమాణంలోనూ, పుట్టుకలోనూ ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్న ఈ కొత్త జీవికి సంబంధించిన పూర్తి వివరాలు శాస్త్ర ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.

డి-రెక్స్ ప్రత్యేకతలు ఏమిటి?

చైనాలోని యున్నాన్ ప్రావిన్స్ అడవులలో కున్మింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బాటనీకి చెందిన పరిశోధకులు ఈ అరుదైన శిలీంధ్ర జాతిని గుర్తించారు. దీని శాస్త్రీయ నామం డియాంజునస్ రెక్స్. దీనిని టైరన్నోసారస్ రెక్స్ డైనోసార్ పేరును పోలి ఉండేలా డి-రెక్స్ అని ముద్దుగా పిలుస్తున్నారు.

ఇది దాదాపు 20 అంగుళాలు (50 సెంటీమీటర్ల) ఎత్తు వరకు పెరుగుతుంది. అంతేకాకుండా దీని బరువు సుమారు 2.2 కిలోలు (దాదాపు 5 పౌండ్లు) వరకు ఉంటుంది. ఆస్కోమైకోటా అనే భారీ శిలీంధ్ర వర్గంలో ఇంతటి భారీ ఎత్తుగల ఫ్రూటింగ్ బాడీ లభించడం ఇదే మొదటిసారని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని వేర్లు చెట్ల చనిపోయిన భాగాల నుండి పోషకాలను గ్రహిస్తాయి.

ఇవి కూడా చదవండి

6.5 కోట్ల సంవత్సరాల నాటి చరిత్ర!

ఈ ఫంగస్ డీఎన్ఏ, జన్యువులను పరిశీలించిన శాస్త్రవేత్తలు దీని పరిణామ క్రమం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. భూమిపై ఉల్కాపాతం కారణంగా డైనోసార్లు అంతరించిపోయిన కాలం (సుమారు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం – ఎండ్ క్రెటేషియస్ మాస్ ఎటింక్షన్) నాటి పరిస్థితులతో దీని మూలాలు ముడిపడి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. డైనోసార్లు అంతరించిపోయిన తర్వాత అడవులలో విపరీతంగా పేరుకుపోయిన చెత్తాచెదారం, కుళ్ళిన చెట్ల నుండి ఈ జీవులు పరిణామం చెంది ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇంతింతగా పెరగడానికి కారణం ఏమిటి?

ఈ ఫంగస్ ఇంత భారీ పరిమాణంలో ఎందుకు పెరుగుతుందనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. దట్టమైన అడవులలో దీని నుంచి వెలువడే బీజాంశాలు గాలి ద్వారా చాలా దూరాలకు సులభంగా ప్రయాణించి కొత్త మొక్కలు లేదా శిలీంధ్రాలు పుట్టుకురావడానికి ఈ ఎత్తు సహాయపడుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

ఆసియా అడవులలో ఇప్పటికీ మానవులకు తెలియని జీవవైవిధ్యం ఎంతో దాగి ఉందని ఈ డి-రెక్స్ నిరూపిస్తోంది. భూమి పుట్టుక, గతంలో జరిగిన భారీ వినాశనాలు జీవుల పరిణామ క్రమాన్ని ఎలా ప్రభావితం చేశాయో తెలుసుకోవడానికి ఈ అద్భుతమైన ఆవిష్కరణ శాస్త్రవేత్తలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us