Rain Alert: చల్లబడ్డ వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు: వాతావరణ శాఖ

|

Feb 25, 2024 | 7:55 AM

మరో ద్రోణి విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా కోస్తా ఆంధ్ర వరకు ఆవరించి ఉంది. ఆవర్తనం, ద్రోణి సముద్రమట్టానికి దాదాపు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వానలు కురుస్తాయి. ఉత్తర కోస్తాలో ఆది, సోమవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ కోస్తాలో కూడా పరిస్థితి అలాగే ఉంటుందని అంచనా వేసింది. రాయలసీమ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు

Rain Alert: చల్లబడ్డ వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు: వాతావరణ శాఖ
Rain Alert
Follow us on

వేసవి రాక ముందే వేడితో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనానికి ద్రోణులు తోడు కావడంతో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. వేసవి రాక ముందే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. అయితే ఒకేసారి రెండు ద్రోణులు ఏర్పడడం, దీనికి ఉపరితల ఆవర్తనం తోడు కావడంతో వాతావరణం చల్లబడుతుందంటోంది వాతావరణ శాఖ. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

మరో ద్రోణి విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా కోస్తా ఆంధ్ర వరకు ఆవరించి ఉంది. ఆవర్తనం, ద్రోణి సముద్రమట్టానికి దాదాపు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వానలు కురుస్తాయి. ఉత్తర కోస్తాలో ఆది, సోమవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ కోస్తాలో కూడా పరిస్థితి అలాగే ఉంటుందని అంచనా వేసింది. రాయలసీమ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. మరోవైపు తెలంగాణ పైనా ఆవర్తన ప్రభావం ఉంది. తెలంగాణలో కూడా రెండు రోజుల పాటూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ వర్షపు జల్లులు కురుస్తాయని పేర్కొది. ఇక ఖమ్మం, నల్గొండ జిల్లాలు మినహాయించి తెలంగాణలో మూడు రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. రాత్రిపూట ఖమ్మం, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఉపితల ఆవర్తనం ప్రభావంతో..

ఇదిలా ఉండగా, ఉపరితల ఆవర్తన ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, శనివారం ములుగు, కరీంనగర్​, నల్గొండ, సిద్దిపేట, నారాయణపేట, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.

 


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి