AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రభుత్వ ఆస్పత్రిలో మూడురోజుల పాప మృతి.. వైద్యుల నిర్లక్ష్యం అంటూ బంధువులు ఆందోళన..

Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhdrachalam)ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పుట్టిన 3 రోజుల చిన్నారి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందింది అని ఆసుపత్రి వద్ద తల్లిదండ్రులు, బంధువులు..

Telangana: ప్రభుత్వ ఆస్పత్రిలో మూడురోజుల పాప మృతి.. వైద్యుల నిర్లక్ష్యం అంటూ బంధువులు ఆందోళన..
3 Days Baby Dead
Surya Kala
|

Updated on: Jan 19, 2022 | 11:49 AM

Share

Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhdrachalam)ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పుట్టిన 3 రోజుల చిన్నారి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందింది అని ఆసుపత్రి వద్ద తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. మూడు రోజుల క్రిందట ఆంధ్రా లోని నెల్లిపాక (nellipaka)మండలంలోని కాపారం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న పురిటి నొప్పులతో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరింది. ఆరోజు పండంటి చిన్నారి ఆడ శిశువు కు జన్మనిచ్చింది. పుట్టిన మూడు రోజుల తర్వాత కొద్దిగా  కామెర్లు వుండడం తో సి.ఎన్.సి కేంద్రంలో శిశువు ను ఉంచి తల్లిపాలు ఇస్తూ శిశువు ఆరోగ్యంగానే ఉంది అని వైద్యులు తెలిపారు అని బంధువులు ఆరోపిస్తున్నారు.

మూడో రోజు మధ్యాహ్నం శిశువు కి తల్లి పాలు ఇచ్చిన తర్వాత శిశువు ను శిశువుల స్పెషల్ రూమ్ లో తీసుకెళ్లి ఉంచారు అని ఓ గంట తర్వాత వచ్చి శిశువు చనిపోయింది అని ఆసుపత్రి సిబ్బంది శిశువు ను తెచ్చి బంధువులకు అప్పగించారు అని బంధువులు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల నుంచి ఉమ్మనీరు మింగిన కారణంగా స్పెషల్ రూమ్ లో వుంచినా, ఎటువంటి అనారోగ్యంతో బాధపడని చిన్నారి ఇప్పుడు అకస్మాత్తుగా ఎలా చనిపోతుంది అని ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు.

తమకేమీ సంబంధం లేదని శిశువు కి తల్లిపాలు ఇచ్చిన తరువాత శిశువును తల్లి పట్టించుకోకపోవడంతో శిశువు మృతి చెంది ఉంటుంది వైద్యులు తెలిపారు. శిశువు పచ్చగా మారడంతో పచ్చ కామెర్లు ఎక్కువై శిశువు మృతి చెందింది అని బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి  ఘటనలు జరుగుతున్నాయి అని బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యులను నిలదీశారు. వైద్యులు మాత్రం శిశువు మృతికి ఆసుపత్రి వైద్యులు సిబ్బంది కారణం కాదని అంటున్నారు. శిశువు మరణం పట్ల ఏదైనా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆసుపత్రి సూపర్ డెంట్   రామకృష్ణ సూచించారు. అప్పుడు విచారణ చేసి శిశువు మృతికి కారణమైన సిబ్బందితో పాటు వైద్యుల పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపర్ డెంట్   రామకృష్ణ శిశువు బంధువులకు నచ్చ చెప్పారు. దీంతో శిశివు బంధువులు శిశువు ను తీసుకుని ఆసుపత్రి నుండి వెళ్లిపోయారు.

Also Read: ఈ శుక్రవారం బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ మీల్స్.. ఏ ఒటిటిలో నైనా అఖండ సహా భారీ షోలు సందడే సందడి..

Follow Us