AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Telugu: ఈ శుక్రవారం బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ మీల్స్.. ఏ ఒటిటిలో నైనా అఖండ సహా భారీ షోలు సందడే సందడి..

OTT Streaming: దేశంలో కరోనా వైరస్ (Corona Virus) అడుగు పెట్టి.. లాక్ డౌన్ విధించినప్పుడు డిజిటల్ వైపు సినిమాలు అడుగులు వేయడం మొదలు పెట్టాయి. భారీగా ప్రేక్షకులను ఆకర్షిస్తూ.. స్టార్ హీరోలు..

OTT Telugu: ఈ శుక్రవారం బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ మీల్స్.. ఏ ఒటిటిలో నైనా అఖండ సహా భారీ షోలు సందడే సందడి..
Ott Moives
Surya Kala
|

Updated on: Jan 19, 2022 | 10:41 AM

Share

OTT Telugu: దేశంలో కరోనా వైరస్ (Corona Virus) అడుగు పెట్టి.. లాక్ డౌన్ విధించినప్పుడు డిజిటల్ వైపు సినిమాలు అడుగులు వేయడం మొదలు పెట్టాయి. భారీగా ప్రేక్షకులను ఆకర్షిస్తూ.. స్టార్ హీరోలు సైతం తమ వైపు దృష్టి సారించేలా చేశాయి. మళ్ళీ కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న వేళ.. తెలుగు రాష్ట్రాలు కూడా కరోనా కట్టడి కోసం ఆంక్షలను విధిస్తున్నాయి. దీంతో ఈ వారం కూడా థియేటర్స్ లో సినిమా రిలీజ్ ల సందడి లేదనే చెప్పాలి. అయితే ఒటిటి లో మాత్రం సిని అభిమానులకు కనుల విందు.. గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సినిమాలు ఈ శుక్రవారం(జనవరి 21వ తేదీ)లో డిజిటల్ ప్లాట్ ఫాంపై రావడానికి సిద్ధమవుతున్నాయి. బుల్లి తెర ప్రేక్షకులకు ఈ వారం ఫుల్ మీల్స్..

టాలీవుడ్ సీనియర్ బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కి.. హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్న అఖండ సినిమా ఒటిటి లో అడుగు పెట్టనుండి. ఈ నెల 21న ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన అఖండ మూవీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. కరోనా నేపధ్యంలో కూడా కలక్షన్ల సునామీ సృష్టించిన అఖండ మూవీ ఓటీటీలో ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి. ఇక హౌ ఐ మెట్ యువర్ ఫాదర్ షోతో పాటూ బిలియన్స్ సీజన్ 6 షో హాట్ స్టార్ లో 21న రిలీజ్ కాబోతుంది.

నేచరల్ స్టార్ నాని తాజా సినిమా శ్యామ్ సింగ రాయ్. సాంకృత్యన్ దర్శకత్వంలో నాని ద్విపాత్రాభినయంలో రెండు వైవిధ్య పాత్రలతో అలరించాడు. సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజై హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద చేసింది. జనవరి 21న నెట్ ఫ్లిక్స్ లో శ్యామ్ సింగ రాయ్ చేయడానికి సిద్ధమవుతుంది.

నెట్ ఫ్లిక్స్ సినిమాలతో పాటు సరికొత్త షోలతో అలరించడానికి రెడీ అవుతుంది. రొమాంటిక్ కామెడీ, థ్రిల్లర్, హిస్టారికల్ షోలతో హల్ చల్ చేయబోతుంది. ఈ నెల 21 శుక్రవారం ది పప్పట్ మాస్టర్ షో తో పాటూ టూ హాట్ టు హ్యాండిల్ సీజన్ 3కి రిలీజ్ కానుంది. ది రాయల్ ట్రీట్ మెంట్, మునిచ్.. ది ఎడ్జ్ ఆఫ్ వార్, ఓజార్క్ సీజన్ 4, సమ్మర్ హీట్ వంటి అనేక సరికొత్త కంటెంట్ తో హల్చల్ చేయబోతుంది.

అమెజాన్ ప్రైమ్ లో కూడా పలు షో లు ఈ శుక్రవారం జనవరి 21 న రిలీజ్ కానున్నాయి. అన్ పాజడ్ నయా సఫర్, ఎ హీరో వంటి సినిమాలతో ప్రైమ్ ఎంగేజ్ చేయబోతుంది. జీ5లో లూజర్ సీజన్2, ముదాల్ నీ ముదివమ్ నీ వంటి ప్రాజెక్ట్స్ రానుండగా.. సోనీలివ్ లో భూతకాలమ్ సందడి చేయడానికి రంగం సిద్ధమవుతుంది.

Also Read: అనంతపురం జిల్లాలో కొండచిలువ కలకలం.. గొర్రెలను మాయం చేస్తోన్న మినీ అనకొండ..