Venkatesh: బాలకృష్ణ బాటలోనే వెంకటేష్.. రియాలిటీ షోకు హోస్ట్‌గా చేయనున్న వెంకీ ?
వెండితెరపై తమ సత్తా చూపి స్టార్ హీరోలుగా ఉన్నవారు ఇప్పుడు బుల్లితెరపై మనసు పారేసుకుంటున్నారు. ఓవైపు బ్లాక్ బస్టర్ హిట్
వెండితెరపై తమ సత్తా చూపి స్టార్ హీరోలుగా ఉన్నవారు ఇప్పుడు బుల్లితెరపై మనసు పారేసుకుంటున్నారు. ఓవైపు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతూనే మరోవైపు తమలోని మరో కోణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. విలన్స్‌ను రఫ్పాడించే హీరోలుగానే కాకుండా.. తమదైన కామెడీ పంచులతో ప్రేక్షకులను అలరించేందుకు యాంకర్స్‌గా మారిపోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో పలువురు స్టార్ హీరోలు వ్యాఖ్యతలుగా మారి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్, బాలకృష్ణ, కమల్ హాసన్ వంటి అగ్రకథానాయకులు బుల్లితెరపై హోస్ట్‌గా తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు వీరి జాబితాలోకి మరో స్టార్ హీరో రాబోతున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.
టాలీవుడ్ అగ్రకథానాయకులలో ఒకరైన వెంకటేష్ ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వెంకీ ఎఫ్ 3 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే .. తాజా సమచారం ప్రకారం వెంకీ హోస్ట్‌గా మారబోతున్నాడట. ఎప్పటికప్పుడు సరికొత్త సినీ కంటెంట్.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఉత్సాహాన్నిచ్చే గేమ్ షోస్.. టాక్ షోలతో డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకుపోతుంది ఆహా. ఈ క్రమంలోనే ఎవరు ఊహించని విధంగా నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా ఆహాలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో నిర్వహిస్తున్నారు. ఈ టాక్ షో భారీ స్థాయిలో సక్సెస్ అయ్యింది.
ఈ క్రమంలోనే ఆహాలో మరో రియాలిటీ షో రాబోతుందట.. అంతేకాదు. ఈ షోకు వెంకటేష్ వ్యాఖ్యతగా వ్యవహించనున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం వెంకీతో ఇదే విషయంపై చర్చిస్తున్నారట మేకర్స్. మరీ ఇందుకు వెంకటేష్ ఒప్పుకున్నారా ? లేదా అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Sneha: సంక్రాంతి సంబరాల్లో హీరోయిన్ స్నేహ ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..