Telangana: రోడ్డుపై కారును అమాంతం ఎత్తుకెళ్లారు.. అంతా పోలీసులనుకున్నారు.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్..

|

Dec 17, 2022 | 9:15 PM

నో పార్కింగ్‌ జోన్‌లో పార్క్‌ చేస్తేనో.. యాక్సిడెంట్‌ అయితోనే.. క్రేన్‌తో కారును లాక్కెళ్లే దృశ్యాలు షరా మాములే. వరంగల్‌ నగరంలో అట్టాంటి సీనే తళుక్కుమంది. ఎవరి గోల వారిదే కదా..

Telangana: రోడ్డుపై కారును అమాంతం ఎత్తుకెళ్లారు.. అంతా పోలీసులనుకున్నారు.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్..
Car
Follow us on

నో పార్కింగ్‌ జోన్‌లో పార్క్‌ చేస్తేనో.. యాక్సిడెంట్‌ అయితోనే.. క్రేన్‌తో కారును లాక్కెళ్లే దృశ్యాలు షరా మాములే. వరంగల్‌ నగరంలో అట్టాంటి సీనే తళుక్కుమంది. ఎవరి గోల వారిదే కదా.. ఇదో చోరీ వ్యవహారమని.. కారును ఇలా కూడా ఎత్తుకెళ్లొచ్చడని ఎవరూ పసిగట్టలేదు. ఎవరికీ డౌట్‌ రాలేదు. కానీ మూడో నేత్రం ఈ దృశ్యాన్ని క్లిక్‌ మన్పించింది. తన కారు కన్పించడంలేదని ఓ వ్యక్తి ఫిర్యాదు చేస్తే.. ఖాకీలు దర్యాప్తు చేపట్టారు. కూపీలాగితే ఈ సీను తళుక్కుమంది. నెంబర్‌ ఆధారంగా అది తనకారేనని గుర్తించాడు ఓనర్‌. తీసుకెళ్లింది పోలీసులు కాదు.. కార్పొరేషనోళ్లు కాదు.. మరి ఈ తరలింపు వెనుక సంగతేంటి? కట్ చేస్తే పాత ఇనుప సామాన్ల షాప్‌ ఇదిగో ఇలా ఫ్రేమ్‌లోకి వచ్చింది.

కడక్‌ కారు.. తుక్కు తుక్కయింది. ముక్కలు ముక్కలుగా చేసి విడి భాగాలను అప్పటికే తూకం వేశారు. మ్యాటరేంటో అర్ధమైందికదా. దొంగిలించిన కారును సెకండ్‌ సేల్‌లో అమ్మేస్తే డబ్బు బాగానే వస్తది. కానీ రిజిష్ట్రేన్‌ నెంబర్‌తో దొరికిపోవడం ఖాయం. అందుకే కేటుగాళ్లు తమ చాల్‌గిరి ప్రదర్శించారు. కారును పార్ట్‌ పార్టులగా చేసి తుక్కు కింద విక్రయించి సొమ్ము చేసుకున్నారు. కేటుగాళ్ల ఇస్మార్ట్‌ చోరీ చూసి సదరు కారు ఓనర్‌ సహా ఖాకీలు కూడా షాక్‌కు గురయ్యారు. మొత్తానికి సీసీ టీవీ పోలిసింగ్‌ వళ్ల ఈ చిత్రమ్‌ తెరపైకి వచ్చింది. అనుమానితులుగా కొందర్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..