Weekend Hour: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త కష్టాలు.. అసమ్మతీ కాస్తా తిరుగుబాటుగా మారిన వైనం..
ఒరిజినల్ కాంగ్రెస్ నేతలం తామేనని.. పార్టీని బతికించుకునే బాధ్యత కూడా తమదేనని క్లియర్ కట్‌గా తేల్చేశారు. తమ పంచాయితీ అంతా వలస వచ్చిన నేతలతోనే అని కుండబద్దలు కొట్టారు.
ఒరిజినల్ కాంగ్రెస్ నేతలం తామేనని.. పార్టీని బతికించుకునే బాధ్యత కూడా తమదేనని క్లియర్ కట్‌గా తేల్చేశారు. తమ పంచాయితీ అంతా వలస వచ్చిన నేతలతోనే అని కుండబద్దలు కొట్టారు. కొత్త కమిటీల ఏర్పాటుతో మొదలైన కల్లోలం.. రేవంత్‌రెడ్డితో తాడో పేడో అనే దాకా వెళ్లింది.కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడం. ఎట్ ద సేమ్ టైమ్ ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు కమిటీల్లో ప్రాధాన్యం కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు. కమిటీల్లో 108మందికి స్థానం కల్పిస్తే అందులో 54 మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులనే కోవర్టులు అంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు సీనియర్లు. వార్ రూమ్ అని చెబుతున్న సునీల్ కనుగోలు ఆఫీసులో తమపై కూడా చెత్త ప్రచారం చేయించడం ఏంటని ప్రశ్నించారు ఉత్తమ్.ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు అధికార బీఆర్ఎస్ గల్లీ టు ఢిల్లీ ఫైటింగ్ స్పిరిట్‌తో దూసుకెళుతోంది. బీజేపీ కూడా ధీటుగా వరుస సమావేశాలు యాత్రలతో కేడర్‌లో జోష్ నింపుతోంది. కానీ తెలంగాణ ఇచ్చిన, తెచ్చిన అని చెప్పుకుంటున్న హస్తం పార్టీ మాత్రం అస్తవ్యస్తంగా మారింది. అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. తాజాగా వచ్చిన తిరుగుబాటు ఏ దరికి చేరుస్తుందో చూడాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..