Telangana: అరె.! ఎలారా ఇలా.. పోలీసులకే మస్కాకొట్టాడు.. స్కెచ్ చూస్తే దిమ్మతిరుగుద్ది

| Edited By: Ravi Kiran

Aug 16, 2024 | 5:16 PM

నిర్మల్ జిల్లా బైంసాలో రిమాండ్‌కు తరలిస్తున్న నిందితుడు పోలీసుల కస్టడీ నుండి పరారయ్యాడు. అరెస్ట్ అయి రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. పోలీసులకు మస్కా కొట్టి మాయమయ్యాడు. పరారైన నిందితుడిపై గతంలోనే పీడీ యాక్ట్ నమోదవగా..

Telangana: అరె.! ఎలారా ఇలా.. పోలీసులకే మస్కాకొట్టాడు.. స్కెచ్ చూస్తే దిమ్మతిరుగుద్ది
Representative Image
Follow us on

నిర్మల్ జిల్లా బైంసాలో రిమాండ్‌కు తరలిస్తున్న నిందితుడు పోలీసుల కస్టడీ నుండి పరారయ్యాడు. అరెస్ట్ అయి రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. పోలీసులకు మస్కా కొట్టి మాయమయ్యాడు. పరారైన నిందితుడిపై గతంలోనే పీడీ యాక్ట్ నమోదవగా.. మారణాయుధాలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో వలపన్ని పట్టుకున్నారు పోలీసులు. ఏఎస్పీ అవినాష్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించిన కొద్ది‌నిమిషాల్లోనే ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. నిందితుడిపై గతంలో 5 కేసులు నమోదైనట్లు.. పిడి యాక్ట్ కూడా ఉందని తెలిపారు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్.

భైంసాలో పోలీసుల వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. పట్టుబడిన వ్యక్తి పాత నేరస్తుడని.. సోషల్ మీడియాలో మారణాయుధాలతో హల్చల్ చేస్తున్నట్టుగా గుర్తించారు. విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని అబ్దుల్ జుబేర్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి మీడియా వివరాలు వెల్లడించి‌న పోలీసులు రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే బాత్రూం వస్తుందంటూ తెలిపిన నిందితుడిని ఎస్కార్ట్ టీం టాయిలెట్ వైపు పంపించింది. ఇదే అదునుగా భావించిన నిందితుడు ఎస్కార్ట్ సభ్యుల కళ్లుగప్పి గోడ దూకి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న ఎస్కార్ట్ టీం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు కస్టడీ నుండి పరారైన నిందితుడు అబ్దుల జుబేర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు‌.

నిందితుడి జుబేర్‌పై 5 కేసులున్నాయని.. గతంలోనే పిడి యాక్ట్, రౌడీ షీట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ సమయంలో నిందితుడి‌ వద్ద నుండి రెండు కత్తులు, ఒక ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచిన కొద్ది నిమిషాల్లోనే ఈ ఘటన జరగడంతో పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

 

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..