Telangana News: తెలంగాణ ప్రజలందరికీ శుభవార్త.. వారందరికీ మరోసారి అవకాశం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చేలా మరో నిర్ణయం తీసుకుంది. భూముల వివరాల్లో తప్పులను సరిద్దుకునేందుకు గడువు పొడిగించింది. రైతులు భూభారతి పోర్టల్ ద్వారా తప్పులను సరిదిద్దుకోవచ్చు. ఆ పోర్టల్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Telangana News: తెలంగాణ ప్రజలందరికీ శుభవార్త.. వారందరికీ మరోసారి అవకాశం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Cm Revanth Reddy

Edited By:

Updated on: Jan 08, 2026 | 4:16 PM

సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రైతులకు ఊరటనిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి వెబ్ పోర్టల్ వల్ల ఏర్పడిన భూసమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. వీలైనంత త్వరగా ధరణిలో నెలకొన్న భూముల సమస్యలను పరిష్కరించి రైతుల ఇబ్బందులను తీర్చేందుకు మరింత సమయమిచ్చింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 13 వరకు ప్రభుత్వం గుడువు పొడిగించింది. ఈ గడవులోగా ధరణిలో తప్పుగా నమోదైన భూముల వివరాలను మార్చుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాంకేతిక, రికార్డు పరమైన తప్పులను రైతులు సరిదిద్దుకోవచ్చని తెలిపింది. రైతులందరూ భూభారతి కార్యక్రమం ద్వారా సులభంగా తప్పులు సరిద్దుకోవచ్చని రేవంత్ సర్కార్ వెల్లడించింది.

రైతులకు బెనిఫిట్

ఒకరి భూమి మరొక పేరు మీదకి వెళ్లడం, సర్వే నెంబర్లు తప్పుగా పడటం, భూమి విస్తీర్ణంలో తేడాలు పడటం, నిషేధిత జాబితాలో ఉండటం వంటి అన్నింటిల్లో రైతులు మార్పులు చేసుకోవచ్చు. గతంలో ఇందుకోసం రైతులకు ఇచ్చిన గడువు ఇటీవల ముగిసింది. అయినా రాష్ట్రంలో చాలామంది రైతులు ఇంకా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం మరోసారి రైతులకు అవకాశం కల్పించింది. గతంలో ధరణి పోర్టల్‌లో 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులు ప్రభుత్వం దృష్టికి రాగా.. వాటిని అధికారులు పరిష్కరించారు. ఇప్పుడు మరోసారి తప్పులు సరిద్దుకునే అవకాశం ఇవ్వడంతో ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు బెనిఫిట్ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం భూభారతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ ప్రొగ్రాం కింద గ్రామాల్లో ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూమలు రీసర్వే నిర్వహిస్తోంది.

తప్పులు సరిద్దుకోవడం ఎలా అంటే..?

తమ భూములకు సంబంధించి ప్రభుత్వం రికార్డులు, డాక్యుమెంట్లలో తప్పుగా నమోదు అయి ఉంటే రైతులు వివరాలను మార్చుకోవచ్చు. ఇందుకోసం మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే భూభారతి పోర్టల్‌లోకి నేరుగా వెళ్లి కూడా రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ నాటికి అన్నీ వివాదాలను పరిష్కరించి భూములను పక్కాగా డిజిటలైజేషన్ చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఈ గడువులోగా రైతులు సమస్యలు పరిష్కరించేందుకు సిద్దమవుతోంది. రైతులకే కాకుండా రియల్ ఎస్టేట్ భూములకు కూడా దీని వల్ల లాభం జరగనుంది. రియల్ ఎస్టేట్ వివాదాలు కూడా పరిష్కారం కావడం వల్ల భూమలు రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి. దీని వల్ల ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయ పెరగుతుంది.