రాజకీయ రంగు పులుముకుంటున్న సుంకిశాల వ్యవహారం.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం దాహార్తీ తీర్చే సుంకిశాల తాగునీటి పథకం చుట్టూ రాజకీయ రంగు పులుముకుంటోంది.

రాజకీయ రంగు పులుముకుంటున్న సుంకిశాల వ్యవహారం.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం
Sunkishala Pump House
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Aug 10, 2024 | 11:49 AM

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం దాహార్తీ తీర్చే సుంకిశాల తాగునీటి పథకం చుట్టూ రాజకీయ రంగు పులుముకుంటోంది. సుంకిశాల పంప్ హౌజ్ నీట మునగడానికి కారణం ఎవరన్నదానిపై పరస్పరం విమర్శలు దాడి చేసుకుంటున్నాయి. సుంకిశాల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని,మంచి జరిగితే మాది, చెడు జరిగితే మీది అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ ధ్వజమెత్తుతోంది.

సుంకిశాల ఘటననను కూడా గత ప్రభుత్వం మీదికి నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నదని మండిపడుతోంది. సుంకిశాల పాపం ముమ్మాటికీ బీఆర్ఎస్‌దేనని, తప్పును కాంగ్రెస్ పైకి నెట్టాలని చూస్తున్నారని ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామని, వాస్తవాలను ప్రజల ముందు చూపెడతామని కాంగ్రెస్ అంటోంది. మసిపూసి బట్టమీద కాల్చివేస్తే సహించేది లేదని కాంగ్రెస్ హెచ్చరిస్తోంది. దీంతో సుంకిశాల కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి.

హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తి తీర్చేందుకు నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల వద్ద ఉమ్మడి ఏపీ సీఎంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్న సమయంలో పనులు చేపట్టారు. జిల్లాకు చెందిన సీపీఎం, టీడీపీ వర్గాలు అడ్డుకున్నారు. సుంకిశాల నుండి జిల్లాకు తాగునీరు ఇవ్వకుండా హైదరాబాద్ కు ఎలా తరలిస్తారంటూ ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో ఏర్పాటు చేసిన కోట్ల కార్యక్రమం సందర్భంగా జరిగిన పోలీస్ ఫైరింగ్ లో ఎస్ఐ చనిపోవడంతోపాటు ఇద్దరు తీవ్రంగా గాయపడదంతో సుంకిశాల పథకం అటకెక్కింది. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయంతో ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల (AMRP)పథకం రూపు దిద్దుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ ద్వారా పుట్టంగండి వద్ద ఎత్తిపోతల ద్వారా అక్కంపల్లి రిజర్వాయరు నుంచి కోదండాపూర్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కు నీటిని చేర్చి, అక్కడ శుద్ది చేసి రోజుకు మూడు దశల్లో 270 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు.

సుంకిశాల ప్రాజెక్టు…

నాగార్జునసాగర్‌ జలాశయం డెడ్‌ స్టోరేజీలో ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయడం కష్టంగా మారి జంట నగరాలకు తాగునీటి కటకట ఏర్పడుతోంది. జంట నగరాలకు భవిష్యత్‌ తాగునీటి అవసరాల దృష్ట్యా రూ.2215 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పనులకు 2022 మే 14వ తేదీన నాటి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు శంకుస్థాపన చేశారు. నగర విస్తరణను దృష్టిలో పెట్టుకుని 50 ఏళ్ల నాటికి 2072లో 70.97 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనాతో సుంకిశాల ఇన్‌టేక్‌ వెల్‌ పంపింగ్‌ స్టేషన్‌ను ఎమర్జెన్సీ పంపింగ్‌ అనే సమస్య లేకుండా ప్లాన్ చేసింది.

పెద్దవూర మండలం సుంకిశాల ప్రాజెక్టు వద్ద ఇన్‌టేక్‌ వెల్‌ పంపింగ్‌ స్టేషన్‌ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. వివిధ లోతుల్లో నీటిని తీసుకునేందుకు వీలుగా పంప్ హౌస్ నుంచి మూడు సొరంగాలు(టన్నెళ్లు) నిర్మిస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయంలో 455 అడుగుల లోతు నుంచి నీటిని తీసుకునేందుకు వీలుగా మొదటి సొరంగాన్ని, 450 అడుగుల లోతు నుంచి తీసుకునేందుకు రెండోది, 547 అడుగుల లోతు నుంచి నీటిని తీసుకునేందుకు మూడోది నిర్మిస్తున్నారు. పంప్ హౌస్, కృష్ణానదికి మధ్య కేవలం 192 మీటర్లు మాత్రమే దూరం ఉంది. వరద వచ్చిన సమయంలో ఆ ఉద్ధృతి తాకిడి పంప్ హౌస్ లోకి చేరకుండా రక్షణ గోడ (రిటెయినింగ్ వాల్) నిర్మించారు. వచ్చే వేసవిలోగా నీరు అందించాలనే ఉద్దేశంతో మధ్య టన్నెల్ పనులు పూర్తిచేసే క్రమంలో సంపువైపు టన్నెల్ ముందు భారీ గేటు ఏర్పాటు చేశారు.

నీటమునిగిన పంప్ హౌస్..

నాగార్జునసాగర్ కు భారీగా వరద నీరు పోటెత్తడం, ఒక్కసారిగా పంప్ హౌస్ రెండో సొరంగ మార్గం నుంచి ప్రవాహం ఉద్ధృతంగా రావడంతో టన్నెల్ ముందు భాగంలో నిర్మాణంలో ఉన్న గేటుతోపాటు రక్షణ గోడలోని ఒక ప్యానెల్ కొట్టుకుపోయాయి. దీంతో 83 మీటర్ల లోతులో ఉన్న పంప్ హౌస్ లోని సంపు పూర్తిగా నీటితో నిండిపోయింది.

ఘటనపై ఉన్నత స్థాయి విచారణ…

మరోవైపు రిజర్వాయర్ వైపు ఉన్న మట్టిని తొలగించారు. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికిగానీ మధ్య టన్నెల్ స్థాయి వరకు వరద రాదని అధికారులు భావించారు. ‘దానికి భిన్నంగా దాదాపు 3.5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో రావడంతో సాగర్ వద్ద అకస్మాత్తుగా ఒత్తిడి పెరిగి టన్నెల్లోకి భారీ వరద చేరింది. దీంతో టన్నెల్ గేటు ధ్వంసమై, దానికి అనుసంధానంగా ఉన్న రక్షణగోడ కూలిపోయి, వరద నీటితో పంప్ హౌస్ మునిగిపోయిందని జలమండలి అధికారులు చెబుతున్నారు. రక్షణ గోడకు సంబంధించి మూడు బ్లాకులు ఉండగా, మధ్యలో ఉన్న టెన్నెల్ ప్యానెల్ మాత్రమే కూలిందని, మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ఆ సంస్థదేనని స్పష్టం చేశారు. ప్రస్తుత నీటిమట్టం తగ్గిన తర్వాత దెబ్బతిన్న సైడ్ వాల్ భాగాన్ని నిర్మాణ సంస్థ సొంత ఖర్చుతో పునర్మిస్తుందని జలమండలి వివరించింది. ఈ పునర్మిర్మాణ పనులకు సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. ఆ ఘటనపై బోర్డు స్థాయిలో ఉన్నత ఇంజినీర్లతో, ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు జలమండలి స్పష్టం చేసింది. ఈ ఘటనతో హైదరాబాద్‌ తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం లేదని జలమండలి వివరించింది.

ప్రమాదాన్ని ఎందుకు దాచి పెట్టారు.. కేటీఆర్

50 ఏళ్లు హైదరాబాద్ లో నీటికి ఇబ్బంది రాకుండా కేసీఆర్ ముందు చూపుతో ఈ సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశారని, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల పంపు హౌస్ రక్షణ గోడ కూలిపోయిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రతో వ్యవహరించిందని, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే సుంకిశాల ప్రమాదం జరిగితే హౌస్ లో ఎందుకు ప్రకటన చేయలేదని, వారం రోజులు ఈ ప్రమాదాన్ని దాచి పెట్టారని కేటీఆర్ మండి పడుతున్నారు. ఈ డ్యామేజ్ పై జుడీషియరి ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. సుంకిశాల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని, మంచి జరిగితే మాది.. చెడు జరిగితే మీది అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు. సుంకిశాల ఘటననను కూడా గత ప్రభుత్వం మీదికి నెట్టేసి చేతులు దులుపు కోవాలని ప్రయత్నిస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు.

సుంకిశాల పాపం ముమ్మాటికి బీఆర్ఎస్ దే- కాంగ్రెస్..

సుంకిశాలలో కూలిన రిటైనింగ్ సైడ్వాల్, నీట మునిగిన ఇన్టెక్ వెల్, పంపింగ్ స్టేషన్ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఘటన జరిగిన తీరు, కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుంకిశాల ప్రాజెక్టును ఎందుకు ప్రారంభించారో కేసీఆర్, కేటీఆర్ కే తెలియాలి, జంట నగరాలకు తాగునీరు అందించేందుకు సుంకిశాల అవసరం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇది కేసీఆర్ మానస పుత్రికనో లేక కేటీఆర్ మానస పుత్రికనో అర్థం కావడం లేదని అన్నారు. కేటీఆర్ రాజకీయ విమర్శలు చేయడం సరికాదని, కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేయడం సరికాదని గుత్తా అన్నారు.

సుంకిశాలలో జరిగిన ఘటన చిన్నదని, నష్టం కూడా తక్కువేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దీంతో ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. సుంకిశాల అన్ని పనులు BRS హయంలోనే జరిగాయని,BRS ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. సుంకిశాలలో కూలిన రిటైనింగ్ సైడ్వాల్, ఇన్టెక్ వెల్, పంపింగ్ స్టేషన్ నీట మునిగిన విషయం సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వానికి తెలిసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఘటన జరగగానే ప్రభుత్వం స్పందించిందని చెప్పారు. మొత్తంగా సుంకిశాల కేంద్రంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..
40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం