Dalit Bandhu: దళిత బంధు రెండో విడత అమలుకు రంగం సిద్ధం.. ఈసారి ఎంత మందికి అవకాశమంటే ?
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి దళిత బంధు రెండో విడద, అలాగే లబ్ధిదారులపై మంత్రులు సుధీర్ఘంగా చర్చించారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన దళిత వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పపథకాన్ని తీసుకొచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి పథకం అమలు కావడం లేదని చెప్పారు. అలాగే ఈ పథకం రింద అర్హులైన ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాహయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

దళిత బంధు రెండో విడత అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చేవారం లోపల దళిత బంధు ఆర్థిక సాయానికి దరఖాస్తులు అధికారులు సమర్పించాలని.. లబ్ధిదారులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా పారదర్శకత పాటించాలని మంత్రలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ అధికారులను కోరారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంగళవారం రోజున దళిత బంధు రెండోవిడతకు సంబంధించి మంత్రులు సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా వారు పలు వ్యాఖ్యలు చేశారు. ప్రతి నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారులను అత్యంత పారదర్శకంగా ఎంపిక చేయాలని పేర్కొన్నారు. మరో విషయం ఏంటంటే మొదటి దశలో పంపిణీ చేసినటువంటి యూనిట్లపై దృష్టి పెట్టాలని సూచనలు చేశారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి దళిత బంధు రెండో విడద, అలాగే లబ్ధిదారులపై మంత్రులు సుధీర్ఘంగా చర్చించారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన దళిత వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పపథకాన్ని తీసుకొచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి పథకం అమలు కావడం లేదని చెప్పారు. అలాగే ఈ పథకం రింద అర్హులైన ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాహయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో ముందుగా 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశామని.. ఆ తర్వాత వారు కొరుకున్న యూనిట్‌ను అందజేశామని చెప్పారు. అలాగే రెండో విడత అమలులో ఒక్కో నియోజకవర్గానికి 1100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపికి చేసి ఆర్థిక సాయం చేయనున్నామని చెప్పారు. దళిత బంధు కోసం వచ్చిన దరఖాస్తులను రెండు, మూడు రోజుల్లోనే సమగ్ర విచారణ చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైనటువంటివారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు.
మరో విషయం ఏంటంటే డిమాండ్ ఉన్న యూనిట్లను ఎంపిక చేసుకునే విధంగా దళిత బంధు కోసం ఎంపికైన లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. మొదటి విడుతలో అందజేసినటువంటి నిర్వహణ.. వారు పొందిన ప్రయోజనాలపై వీడియో, ఫోటో రూపంలో నివేదికలు అందజేయాలని చెప్పారు. కొనుగోలు చేసిన వాహనాలకు దళితబంధు పథకం స్టిక్కర్లు తొలగిస్తున్నారని.. వాటిని తొలగించకుండా చూడాలని కొంతమంది ఎమ్మెల్యేలు సమావేశంలో మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వాహనాలపై స్టక్కర్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, రహ్మత్ బేగ్ పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.