Hyderabad: కాల్ గర్ల్ కోసం వెతికి.. వారి వలకు చిక్కి.. లక్షలు సమర్పించుకున్నాడు..
ఆన్ లైన్ ఎంత ఉపయోగకరమో.. అంతే ప్రమాదకరం కూడా. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. అసాంఘిక కర్యాకలాపాలు చేసేలా పురిగొల్పుతాయి. ఎందుకంటే ఆన్ లైన్ వేదికగా...

ఆన్ లైన్ ఎంత ఉపయోగకరమో.. అంతే ప్రమాదకరం కూడా. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. అసాంఘిక కర్యాకలాపాలు చేసేలా పురిగొల్పుతాయి. ఎందుకంటే ఆన్ లైన్ వేదికగా కాల్ గర్ల్ ట్రెండ్ నడుస్తోంది. తియ్యని మాటల్లో కవ్వించి, నగ్న ఫొటోలు, వీడియోలతో మైమరిపించింది.. సాంతం ఊడ్చేస్తారు. తాజాగా హైదరాబాద్ మహా నగరంలో ఇలాంటి ఘటనే జరిగింది. చందానగర్‌లో నివాసం ఉండే ఓ వ్యక్తి.. ఐటీగా విధులు నిర్వహిస్తున్నాడు. డిసెంబరు చివరివారంలో ఆన్‌లైన్‌లో కాల్‌గర్ల్ కోసం వెతికాడు. అప్పుడు అతనికి ఓ వెబ్‌సైట్లో లింక్ కనిపించింది. లింకు క్లిక్ చేయగానే వాట్సాప్ నంబరు దొరికింది.
తన పేరు పటేల్ చార్మి అని చెప్పి.. కొందరు అమ్మాయిల ఫొటోలు పంపించాడు. బుకింగ్ కోసం రూ.510, తరువాత రూ.5,500, ఆ తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.7,800.. ఇలా వేర్వేరు కారణాలతో రూ.1.97 లక్షలు కాజేశాడు. చివరకు మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..