Telangana: అబ్బ.! చల్లని వార్త.. తెలంగాణకు భారీ రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో..!
తెలంగాణ భారీ వర్ష సూచన వచ్చింది. రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. పలు జిల్లాలో మొస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిందింది.

రైతన్నలకు హైదరాబాద్ వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణశాఖ పేర్కొంది. గురువారం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇక శుక్రవారం విషయానికొస్తే నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఇక శనివారం కూడా వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇక ఆదివారం హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
ఇక వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వర్షాలు కురిసే సమయంలో చెట్ల సమీపంలో నిలబడవద్దని, పొలాలకు వెళ్లే సమయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భారీ ఈదురుగాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, కరెంటు వైర్లు, చెట్లపై తెగిపడే అవకాశం ఉందని, వాటిని గమనించకుండా వెళితే రైతులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
